ఒకప్పుడు నటుడుగా ఎన్నో చిత్రాలలో నటించి మంచి పేరు సంపాదించారు నటుడు బాలాదిత్య. కానీ ఈ మధ్య మాత్రం పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో ఫెడౌట్ హీరోగా మారిపోయారు. దీంతో ఈ మధ్యకాలంలో బిగ్ బాస్ లో కూడా అడుగు పెట్టాడు బాలాదిత్య. బాలాదిత్య ఇప్పటివరకు 40 సినిమాలలో నటించారు. ఇక హీరోగా 10 సినిమాలలో నటించినట్లుగా తెలుస్తోంది. బాలాదిత్య నటించిన వాటిలో లిటిల్ సోల్జర్స్ అనే సినిమాకు నంది అవార్డు కూడా లభించింది. ఇక వీటితో పాటే చంటిగాడు, మా ఊరి పొలిమేర, 1942లో ఒక గ్రామం తదితర సినిమాలలో హీరోగా బాగానే ఆకట్టుకున్నారు.

బాలాదిత్య హీరోగా దూరమైనప్పటికీ తాజాగా బిగ్ బాస్ -6 వ సీజన్ లో కంటిస్టెంట్ గా పాల్గొని బాగానే ఆకట్టుకున్నారు. దీంతో ప్రేక్షకులకు ప్రస్తుతం బాగా దగ్గరయ్యారని చెప్పవచ్చు. బాలాదిత్య గురించి సోషల్ మీడియాలో ఒక విషయం వైరల్ గా మారుతోంది. బాలాదిత్య నటి సుహాసిని వివాహం చేసుకోవాలనుకున్నారట.. కానీ చేసుకోలేకపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సుహాసిని వెండితెర మీద హీరోయిన్ గా అవకాశాలు అందుకోలేకపోవడంతో బుల్లితెర మీద కూడా పలు సీరియల్స్ లో నటించింది.

ముఖ్యంగా దేవత సీరియల్ ఒక కీలకమైన పాత్రలో నటించింది.ఇక ఈమె సినీ కెరియర్ కాస్త పక్కన పెడితే నటుడు బాలాదిత్య తో ఈమెకు చాలా సన్నిహిత్యం ఉండేదని అప్పట్లో వార్తలు వినిపించాయి. వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారనే కొన్ని రూమర్లు కూడా వచ్చాయి. ఒక ఇంటర్వ్యూలో భాగంగా బాలాదిత్య సుహాసిని గురించి మాట్లాడినట్లు సమాచారం.. బాలాదిత్య మాట్లాడుతూ తనకు సుహాసిని కి ఎలాంటి సంబంధం లేదని మేము పెళ్లి చేసుకోవాలనుకోలేదని.. కేవలం మంచి స్నేహితులను అయితే మేమిద్దరం కలిసి రెండు చిత్రాలలో నటించాము.. ఆ పరిచయం తో ..ఒకరి కారులో మరొకరు వెళ్లే వరకు వచ్చిందని ఇదంతా చూసి తామిద్దరీ మధ్య ఏదో ఉందంటూ వార్తలు వచ్చాయి. ఇందులో ఎలాంటి నిజం లేదని తెలిపారు
బాలాదిత్య.

మరింత సమాచారం తెలుసుకోండి: