చాలామంది బుల్లితెరపై అవకాశాలు దక్కించుకొని అక్కడ మంచి పాపులారిటీ లభించిన తర్వాత సినిమాలలో అవకాశాల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇకపోతే బుల్లితెర నటీమణులు వెండితెరకు పరిచయం కావడం అనేది ఇప్పుడు కొత్త ఏమీ కాదు ఆమధ్య నటి ప్రియా భవాని శంకర్ ,వాణి భోజన్ వంటి హీరోయిన్ లు అంతా కూడా బుల్లితెర నుంచి వచ్చి సినిమాలలో సక్సెస్ అయిన వారే. ఇకపోతే నటుడు శశి కుమార్ కొత్త హీరోయిన్లలో ప్రోత్సహిస్తుండడంతో కారి చిత్రంలో పార్వతి అరుణ్ అనే ఒక కొత్త నటికి కూడా అవకాశం లభించింది. మరొకవైపు అయోత్తి చిత్రంలో ప్రీతి ఇశ్రామి అనే ఒక కొత్త నటి శశి కుమార్ తో జత కట్టిన విషయం అందరికీ తెలిసిందే.

ఇకపోతే తాజాగా శశికుమార్ హీరోగా నటించబోతున్న చిత్రంలో ప్రముఖ బుల్లితెర నటి రాధిక ప్రీతి హీరోయిన్గా పరిచయం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈమె పూవే ఉనక్కాగ అని సీరియల్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇది కన్నడ సీరియల్ కావడం గమనార్హం . ఈ సీరియల్లో పూవరసి అనే పాత్రలో నటించి బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయింది. కాబట్టి సినిమాలలో అవకాశాలు దక్కించుకుంది. ఇకపోతే తన ప్రయత్నాలను ఏమాత్రం విడవకుండా ఫలితం దక్కించుకొని శశి కుమార్ హీరోగా వస్తున్న సినిమాలో అవకాశం దక్కించుకుంది. ఇకపోతే ఈ చిత్రంతో రాధిక ప్రీతి  హీరోయిన్గా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారని చెప్పవచ్చు. ఇకపోతే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంచి అవకాశాలను దర్శించుకుని వెండితెరపై కూడా హీరోయిన్గా రాణిస్తుంటే వారి అభిమానుల ఆనందానికి సంతోషం లేదు అని చెప్పవచ్చు.ఇప్పటికే హన్సిక మొదులుకొని మృణాల్ ఠాగూర్ వంటి వారందరూ కూడా బుల్లితెరపై మొదట అవకాశాలు దక్కించుకుని ఆ తర్వాత వెండి తెర పై సక్సెస్స్ అయిన వారే కావడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: