బిగ్ బాస్-7 లో కామన్ మ్యాన్ కింద రైతుబిడ్డగా ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ ఈ సీజన్ విన్నర్ గా గెలిచి ఒక చరిత్రను తిరగరాశారు. ఈ విషయం తెలిసి చాలామంది సెలబ్రిటీలు పలువురు అభిమానులు నెటిజనుల సైతం పల్లవి ప్రశాంతని మెచ్చుకోవడం జరిగింది.. పల్లవి ప్రశాంత్ ఇలా టైటిల్ గెలవకడానికి అసలు కారణం శివాజీ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. పల్లవి ప్రశాంత్ బిగ్బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత చాలా విచిత్రంగా ప్రవర్తించేవారు.. ఎక్కువగా తాను రైతుబిడ్డ అనే పదాన్ని తీసుకువచ్చి సానుభూతిని పొందాలని చూశారు.

అయితే శివాజీ అమరదీప్ మీద ఉన్న కోపంతో ప్రశాంత్ ఎక్కడ నోరు మెదపకుండా తనని తాను కంట్రోల్ చేసుకుని టైటిల్ని గెలుచుకోవడం జరిగింది. బిగ్బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఈయన తీరును చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు హౌస్ లో వినయంగా కనిపించిన ప్రక్షాంత్ ఇతనేనా అంటూ పలువురు నెటిజన్స్ తెలుపుతున్నారు. ముఖ్యంగా బయటికి వచ్చిన తర్వాత పోలీసులతో అమర్యాదంగా మాట్లాడడం వారు ఇచ్చిన ప్రోటోకాల్ ని బ్రేక్ చేయడం ఇతరత్రా సంఘటనలన్నీ కూడా ప్రశాంత్ అభిమానులకు కోపం తెప్పించేలా చేస్తున్నాయి.


రీసెంట్ గా ఒక యాంకర్ మీరు గెలిచిన డబ్బులను రైతులకు ఇస్తానని చెప్పారు కదా అదే మాట మీద ఉన్నారా అని అడగగా..కచ్చితంగా ఆ మాట మీదే ఉంటాను గెలిచిన ప్రతి రూపాయి కూడా వారికే ఉపయోగిస్తానంటూ ప్రశాంత్ తెలిపారు.. ఆ సమయంలోనే యాంకర్ మీ పక్కనే ఉన్న గ్రామాలలో చాలామంది పంటను పోగొట్టుకొని ఉన్నారు వారు కష్టాలకు సహాయం చేయొచ్చు కదా అని అడగగా.. ప్రశాంత్ సమాధానాన్ని తెలుపుతూ నేను ముఖ్యమంత్రిని కాదు కదా అంత మందికి సహాయం చేయడానికి అంటూ చాలా పొగరుగా మాట్లాడారట.

టైటిల్ గెలిచిన తర్వాత కూడా ఇంటర్వ్యూ ఇవ్వమని చాలా మంది అడగగా వారిని అసభ్య పదాలతో అమర్యాదగా మాట్లాడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో మరి ఎలా ఉంటారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: