తెలుగు ప్రేక్షకులకు లేడీ కమెడియన్ జబర్దస్త్ వర్ష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. మొదట మోడలింగ్ వైపుకు అడుగుపెట్టిన వర్ష ఆ తర్వాత పలు సీరియల్స్ లో నటించి బాగానే పాపులారిటీ సంపాదించుకుంది.కానీ జబర్దస్త్ లోకి ఎంట్రి ఇచ్చిన తర్వాత ఈమె క్రేజ్ భారీగా పెరిగిపోయింది.. జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ పలు రకాల ఈవెంట్లకు సైతం ఎంట్రీ ఇస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకుంది వర్ష. బుల్లితెర పైన తన నటనతో అందరిని ఆకట్టుకున్న ఈమె హీరోయిన్ మెటీరియల్ అయినప్పటికీ కూడా ఎందుకో అవకాశాలు రావడం లేదు.


ఒకవైపు జబర్దస్త్ మరొకవైపు శ్రీదేవి డ్రామా కంపెనీ చేస్తూనే సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్గానే ఉంటుంది.. ఇటీవల వర్ష, ఇమ్మానుయేల్ యాంకరింగ్ చేస్తూ.. ఒక కొత్త షో కూడా మొదలయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు రకాల గ్లామర్ ఫోటోలను తనకు సంబంధించిన ఎలాంటి విషయాలైనా షేర్ చేస్తూ ఉన్న వర్ష ఈ క్రమంలోని తాజాగా ఒక వీడియోని షేర్ చేయడం జరిగింది.. అదేమిటంటే AAA థియేటర్ల తనకు ఎదురైన ఒక చేదు అనుభవాన్ని తెలియజేసింది.


అల్లు అర్జున్ కి సంబంధించిన థియేటర్లో సినిమాను చూసేందుకు వెళ్లగా అక్కడ తన కారును వాలెట్ పార్కింగ్కు ఇచ్చిందట. తిరిగి సినిమా చూసి వచ్చి తీసుకునేందుకు వేచి ఉన్న సమయంలో  ఒక వ్యక్తి వర్ష పైనా చాలా వల్గర్ గా మాట్లాడారని తెలియజేసింది. అతని ప్రవర్తన మాటలు తనని చాలా ఇబ్బందిని కలిగించాయని ఆ వ్యక్తి ఫ్యామిలీ ముందే బూతులు తిట్టడం చాలా ఇబ్బందికరంగా అనిపించిందని తెలిపింది.. ఆ పరిస్థితుల్లో తాను కాకుండా వేరే అమ్మాయి ఉంటే పరిస్థితి ఏంటి అంటూ ఇలాంటి వాక్యాలు అమ్మాయిలు ఎలా తీసుకుంటారంటూ పబ్లిక్కుగా ఆ వ్యక్తి అలా ప్రవర్తించడం చాలా తప్పు అంటూ తెలియజేసింది. అంతేకాకుండా కన్నీరు పెట్టుకుంటూ ఆ వ్యక్తి వీడియోను కూడా షేర్ చేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: