బిగ్ బాస్ సీజన్ -7 ఇటీవలే చాలా గ్రాండ్ గా సక్సెస్ అయ్యింది.డిసెంబర్ 17న గ్రాండ్ ఫినాలిలో రైతుబిడ్డ అయినటువంటి పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచారు. బిగ్ బాస్ హిస్టరీ లోనే మొదటిసారిగా ఒక కామన్ మ్యాన్ కోటాలో పల్లవి ప్రశాంత్ ట్రోఫీ అందుకోవడంతో ఒకసారి కొత్త చరిత్రను సృష్టించారు.. ఈ ఏడవ సీజన్లో మొత్తం 19 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇవ్వగా ఇందులో పల్లవి ప్రశాంత్, శివాజీ, అమర్ దీప్,ప్రిన్స్ యావర్, ప్రియాంక జైన్ ,అర్జున్ అంబాటి వంటి వారు గ్రాండ్ ఫినాలే వరకు వెళ్లారు..


అయితే ఇందులో ఫినాలి పోటీలలో అర్జున్ అంబాటి ఆరవ స్థానం ప్రియాంక జైన్ ఐదవ స్థానం.. ప్రిన్స్ యావర్ 15 లక్షల తీసుకొని టైటిల్ రేసు నుంచి తప్పుకున్నారు. దీంతో పల్లవి ప్రశాంత్, అమర్దీప్, శివాజీ ముగ్గురు కూడా టైటిల్ కోసం నిలిచారు.. చాలామంది శివాజీని ఏడో సీజన్ బిగ్ బాస్ విన్నర్ అని అందరూ అనుకున్నారు. కానీ ఫైనల్ గా ఉల్టా ఫాల్తా మారిపోయింది.శివాజీ మూడో ప్లేసులో సరి పెట్టుకోగా అమర్దీప్ రన్నర్ గా నిలవగా రైతుబిడ్డ ప్రశాంత్ సెవెన్ విన్నర్ గా నిలిచారు.


బిగ్ బాస్ ని సామాన్యులే కాకుండా పలువురు సెలబ్రిటీలు కూడా చూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే చిరంజీవి కూడా బిగ్ బాస్ షో ని ఫాలో అవుతానని ఆయన భార్య కూడా అవుతుందని తెలిపారు. చిరంజీవి దంపతులకు ఇష్టమైన బిగ్ బాస్ కంటెస్టెంట్ ఎవరో అని అడగగా . వారికి నటుడు శివాజీనే అని ఈ విషయాన్ని స్వయంగా శివాజీని ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. నేను నటించిన సైంటిస్ట్ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొనేందుకు వెళ్లగా అక్కడ చిరంజీవి గారు కనిపించి వెళ్ళగా ఆయన పలకరిస్తూ అప్పుడు తనతో ఈ విషయాన్ని చెప్పారని తెలిపారు శివాజీ.

మరింత సమాచారం తెలుసుకోండి: