ఈ ఏడాది సంక్రాంతికి మల్లెమాలవారు ఎక్స్ట్రా జబర్దస్త్ ఎపిసోడ్ ని సరికొత్తగా ముస్తాబు చేయడం జరిగింది. ఇందులో రాకింగ్ రాకేష్, సుజాత, ఇమ్మానుయేల్ ,వర్ష జంటలు నానా హంగామా చేశారు.. వీరికి సంబంధించి ఒక ప్రోమో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా ఈ ఎక్స్ట్రా జబర్దస్త్ లో ఉన్న కంటెస్టెంట్లు ప్రతి ఒక్కరు కూడా తమ కామెడీ పంచ్ డైలాగులతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు. యాంకర్ రష్మీ ఇందులో స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది.. జడ్జిలుగా ఖుష్బూ, కృష్ణ భగవాన్ కనిపిస్తున్నారు.


జనవరి 12వ తేదీన ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ కాబోతోంది. తాజగా ప్రోమో విషయానికి వస్తే.. ఇందులో వర్ష, ఇమ్మానుయేల్ ,అన్నాచెల్లెళ్ల స్కిట్ తో రావడం జరిగింది. వీరిద్దరి మధ్య ఫన్నీ డైలాగులు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాయి. ఆ తర్వాత రాకింగ్ రాకేష్ ,సుజాత, సత్య కలసి ఒక స్కిట్ చేయడం జరిగింది.. ఇటీవల సత్య రీసెంట్ గా నితిన్ నటించిన ఎక్స్ట్రాడినరీ మ్యాన్ సినిమాలో ఒక పాటతో మరింత పాపులారిటీ సంపాదించుకుంది.. స్టేజ్ మీద రాకింగ్ రాకేష్ సజాత నీకు డ్రగ్స్ కేసులో ఏమైనా నోటీసులు పంపించారా అని అడగగా.. ఆమె ఏమి లేదు ఎందుకు అడుగుతున్నావ్ అంటూ కంగారుగా ప్రశ్నించింది..


ఇంత అందంతో నువ్వు మత్తెక్కిస్తుంటే డ్రగ్ నోటీసులు ఎందుకు పంపివ్వలేదు.. అంటూ రాకింగ్ రాకేష్ చాలా ఫన్నీగా ఆమెను పొగిడేశారు.. దీంతో రాకింగ్ రాకేష్ వైఫ్ సుజాత నువ్వు స్టేజ్ దిగు నీకు ఈరోజు ఉంది అంటూ మొత్తానికి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. కానీ సత్య కి డ్రగ్స్ నోటీసులు అంటూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా రాకేష్ చేసిన కామెంట్స్ ఇప్పుడు తెగ వైరల్ గా మారుతున్నాయి. వీరు స్కిట్లు తర్వాత బుల్లెట్ భాస్కర్ ,ఫైమా, పొట్టి నరేష్ చేసిన హంగామా తో ఈసారి సంక్రాంతికి బోలెడంత వినోదం కలిగించే కనిపిస్తోంది. అందుకు సంబంధించి ఈ ప్రోమో వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: