తెలుగులో బిగ్ బాస్ కు మంచి డిమాండ్ ఏర్పడుతోంది. ఇటీవలే సీజన్-7 కూడా ముగిసింది. ఊహించని విధంగా సామాన్య రైతుబిడ్డగా పేరుపొందిన పల్లవి ప్రశాంత్ విన్నర్ గా నిలిచారు. అలాగే నటుడు శివాజీ బుల్లితెర నటుడు అమర్దీప్, శోభా శెట్టి వంటి వారు ఈ సీజన్లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. బిగ్బాస్ ముగిసిన తర్వాత హీరో శివాజీ మంచి పాపులారిటీ అందుకున్నారు పల్లవి ప్రశాంత్ విన్నర్ అవ్వడం వెనుక కారణం శివాజీనే ఉన్నారంటే కూడా ఎన్నో ప్రశంసలు అందుకోవడం జరిగింది.


ఇప్పటికీ పలు రకాల ఇంటర్వ్యూలలో పాల్గొంటూ బిజీగా ఉన్నారు శివాజీ.. అయితే శివాజీ నుంచి ప్రతి ఒక్కరు బిగ్ బాస్ కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకోవడానికి పలు రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.. ఇలాంటి సమయంలో ఎలాంటి ప్రశ్నలకైనా సమాధానం తెలియజేస్తూ ఉన్నారు శివాజీ. ఒక ఇంటర్వ్యూలో యాంకర్ శివాజీని ఇలా ప్రశ్నిస్తూ బిగ్ బాస్ హౌస్ లోకి చాలామంది యంగర్స్ లేదా అంతకంటే కాస్త పెద్దవారు మాత్రమే వెళుతూ ఉంటారు.


అందరూ కలిసి ఒకే చోట ఉంటారు.. పడుకుంటారు.. తింటూ ఉంటారు. మూడు నెలల పాటు శృంగార కోరికలు ఎలా కంట్రోల్ చేయడం సాధ్యమవుతుంది ఏమైనా ఫిజికల్ గా కంట్రోల్ చేసుకుంటారా.. అసలు  హౌస్ లో ఏం జరుగుతోంది.. అంటూ యాంకర్ శివాజీని ప్రశ్నించగా.. అందుకు శివాజీ ఇలా తెలుపుతూ హౌస్ లో ఒక్కసారి లోపలికి వెళ్ళిన తర్వాత 360 డిగ్రీలలో కెమెరాలు పూర్తిగా ఉంటాయని చివరికి బాత్రూం వద్ద కూడా డోర్ తీసుకొని లోపల వెళ్లే వరకు కెమెరాలో కనిపిస్తుందని అలాంటప్పుడు శారీరక సుఖాల గురించి ఎలా ఆలోచిస్తారు.. అలాంటి ఆలోచనలే రావు గెలవాలని ఒత్తిడి ప్రతి ఒక్కరి మీద ఉంటుంది.. నామినేషన్ లో ఎలాంటి పాయింట్లు తీయాలి..నాగార్జున గారు అడిగే ప్రశ్నలకు సమాధానం.. ఎలా చెప్పాలి గేమ్ ఆడాలని ఆలోచనలే తప్ప శృంగార ఆలోచనలు ఎవరికి రావని తేల్చి చెప్పారు.. ఎలాంటి ఏజ్ వారు ఉన్నా కూడా ఆ ఆలోచనలు రావు అని తెలిపారు శివాజీ.

మరింత సమాచారం తెలుసుకోండి: