తెలుగు బుల్లితెర మీద ఏదైనా సంచలనాలను సృష్టించే యాంకర్లలో ఓంకారం కూడా ఒకరు. ఈయన షో చేస్తున్నారంటే ఆడియన్స్ లో భారీ క్రేజ్ ఏర్పడుతుంది. ముఖ్యంగా జెమినీ మ్యూజిక్ లో ఒక చిన్న యాంకర్ గా తన కెరీర్ ని మొదలుపెట్టి.. బుల్లితెర పైన ఒక బ్రాండ్ ఇమేజ్ ని సైతం ఏర్పాటు చేసుకుని స్థాయికి ఎదిగారు.. అంతేకాకుండా యాంకర్ గా వ్యవహరించే షోస్ కి ప్రొడ్యూసర్ గా కూడా ఆయనే వ్యవహరిస్తూ డైరెక్షన్ కూడా ఆయన చేస్తూ ఉంటారు..


అలా ఆయన కెరియర్లో ఆట, ఛాలెంజ్ ,సిక్స్త్ సెన్స్, ఇస్మార్ట్ జోడి, మాయాజాలం ఇతరత్రా షోలు ఉన్నాయి అంతేకాకుండా వెండితెర మీద కూడా రాజు గారి గది, రాజు గారి గది-2 వాటి సినిమాలను కూడా తెరకెక్కించారు. నిర్మాతగా పలు సినిమాలకు వ్యవహరించిన ఓంకార్ ఎప్పుడు కూడా వివాదాలకు దూరంగా ఉంటారు. అయితే గడిచిన కొన్ని సంవత్సరాల క్రితం ఓంకార్ గురించి ఒక రూమర్ తెగ వైరల్ గా మారింది.. అదేమిటంటే ఓంకార్ తన భార్యకు విడాకులు ఇచ్చేసారని త్వరలోనే ఒక హీరోయిన్ రెండో పెళ్లి చేసుకోబోతున్నారని రూమర్స్ వినిపించాయి.


అయితే ఈ రూమర్స్ పైన ఓంకార్ గతంలోనే క్లారిటీ ఇస్తూ ఈ విషయం కేవలం రూమర్స్ మాత్రమే అంటూ కొట్టేశారు.. సోషల్ మీడియాలో ఇలాంటివి ఎక్కువగా వినిపిస్తూనే ఉంటాయి.. అలాంటి వాటిని మైండ్ లోకి అసలు ఎక్కించుకోకూడదు అంటూ తెలిపారు.. కేవలం డబ్బు సంపాదించడం కోసమే ఇలాంటి రాతలు చాలామంది రాస్తూ ఉంటారంటూ వారిని డబ్బు సంపాదించుకొని ఇవ్వండి అంటూ ఓంకార్ మాట్లాడడం జరిగింది. దీంతో ఓంకార పైన వచ్చినవి కేవలం రూమర్సే అన్నట్లుగా మిగిలిపోయాయి. దీంతో ఓంకార్ ఫ్యాన్స్ కాస్త ఊపిరి పీల్చుకున్నారు.. ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు కూడా ఎన్నో చిత్రాలలో హీరోగా నటిస్తూ మంచి విజయాలను అందుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: