యూట్యూబ్ నుంచి మంచి పాపులారిటీ సంపాదించుకొని బుల్లితెర పైన సెలబ్రిటీలుగా మారిన వారిలో యాంకర్ విష్ణు ప్రియ కూడా ఒకరు. యాంకర్ గా ఎన్నో షోలలో అలరించిన ఈ అమ్మడు ఈ మధ్య సోషల్ మీడియాలో పెద్దగా కనిపించడం లేదు. అప్పుడెప్పుడో బిగ్ బాస్ మానస్ తో కలిసి ప్రైవేట్ ఆల్బమ్ లో ఆడి పాడిన ఈ అమ్మడు యూట్యూబ్లో ఈ పాట మంచి పాపులారిటీ అందుకుంది. దాదాపుగా 61 మిలియన్ న్యూస్ సైతం రాబట్టింది. ఈమధ్య యాంకర్ గా కూడా అవకాశాలు తగ్గినప్పటికీ తరచు స్నేహితులతో కలిసి వెకేషన్ కు వెళ్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది విష్ణు ప్రియ.


ఎప్పటికప్పుడు తనకి సంబంధించిన ఫోటోలను కుటుంబానికి సంబంధించిన విషయాలను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు యూట్యూబ్ లో కూడా పలు వీడియోలను డిలీట్ చేస్తూ ఉంటుంది విష్ణు ప్రియ. తాజాగా తనకు తన చెల్లి ఒక డైమండ్ నెక్లెస్ బహుమతిగా ఇచ్చింది అంటూ ఒక వీడియోని రిలీజ్ చేసింది.. ఈ వీడియోలో విష్ణు ప్రియ మాట్లాడుతూ ఒకరోజు తన చెల్లి అయినటువంటి పావనిని తాను ఇంటి నుంచి తరిమేశానని.. కానీ అలా తరిమేసిన ఆమె ఇప్పుడు ఈరోజు ఏ స్థాయికి ఎదిగింది అంటే తన సొంత కారులోనే తనని తీసుకువెళ్లి వజ్రాభరణాలు కొనిచ్చే స్థాయికి వెళ్లిందని తెలిపిందితను చాలా కష్టపడే వ్యక్తి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది. చిన్న వయసు నుంచి తనకు ఎటువంటి లగ్జరీలు ఇవ్వలేకపోయానని.. తను మాత్రం తనకు ఈ రోజున ఒక డైమండ్ నెక్లెస్ కొనిచ్చిందని.. ఇక్కడ చొప్పదగ్గ విషయం ఏమిటంటే గత ఏడాది జనవరి 26న తన తల్లి మరణించిందని.. అమ్మ వర్ధంతికి ఒక్కరోజు ముందు తన రూమ్ లో ఈ గిఫ్ట్ ఇచ్చిందంటూ తెలియజేసింది.ఈ విషయం తనకు చాలా సంతోషపరిచేలా చేసిందని తెలియజేసింది విష్ణు ప్రియ. అందుకు సంబంధించి వీడియో వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: