బిగ్ బాస్ -7 సీజన్ గత ఏడాది పూర్తి అయింది. ఇందులో విన్నర్ గా రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ గెలిచారు.. అయితే ఇందులో కంటెస్టెంట్ గా ఉన్న ప్రియాంక జైన్ అందరికీ బాగా సుపరిచితమే.. ఇప్పుడు తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈమె మాట్లాడుతూ శివాజీ పైన పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా ప్రియాంక మాట్లాడుతూ తాను బయట ఎలా ఉన్నానో లోపల కూడా అలాగే ఉండేదాన్ని అందరికంటే కూడా వెయ్యి శాతం యాక్టివ్గా ఉంటాను అలాంటప్పుడు నేను విన్నర్ అవ్వాలి కాని ఎడిటింగ్లో నేను కొన్ని విషయాలను తప్పు పట్టినట్లుగా చూపించారని తెలిపింది.


హౌస్ లో కొంతమంది స్ట్రాటజీ ప్లేట్ చేసి గేములు ఆడారని.. వాళ్ళలా నేను కూడా చేసి ఉంటే టాప్ ప్లేస్ లో ఉండే దాన్ని అంటూ తెలిపింది ప్రియాంక జైన్.. శివాజీ గారు తన పైన నింద వేశారని.. తాను అపద్దాలు ఆడతానని చెప్పారని.. నేను ఎక్కడా కూడా ఆడలేదు అలా అనడం కరెక్ట్ కాదని చెప్పాను.. కానీ ఆయన నువ్వు అబద్ధాలే ఆడుతున్నావు అనేవారు.. చేయని పనిని చేశాను అంటే ఎలా ఒప్పుకుంటానని అందుకే ఎన్నోసార్లు ఆయనని నిలదీశాను.. గట్టిగా అడిగాను ఆ సమయంలో శివాజీ గారికి దగ్గర అవ్వాలనుకున్నాను .. కానీ తనని మాత్రం దూరం పెడుతూ వచ్చారని తెలిపింది.


శివాజీ గారు లోపల బయట ఒక రకంగా ఉండరు. అతను జెన్యూన్ మాత్రం కాదని..ఆయన మాస్టర్ మైండ్ తో ఆలోచించే వారిని తెలిపారు. ఆయన హౌస్ లో ఉన్నప్పుడే ఏంటో అర్థమయిందని తెలిపారు. తనకు ఆరోగ్యం బాగాలేక ఇంజక్షన్, పీల్స్ కూడా వాడానని కానీ అవేవి షోలో చూపించలేదంటూ ప్రియాంక తెలియజేసింది.. ప్రస్తుతం ఈమె సీరియల్స్ లో నటించడం లేదు తన తల్లికి అనారోగ్య సమస్యల కారణంగా తన తల్లిని చూసుకుంటూ యాక్టింగ్ కాస్త బ్రేక్ ఇచ్చినట్లుగా తెలియజేసింది ప్రియాంక జైన్.

మరింత సమాచారం తెలుసుకోండి: