తెలుగు బుల్లితెర పైన అమృతం సీరియల్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు నటుడు కమెడియన్ గుండు హనుమంతరావు.. సినీ ఇండస్ట్రీలో ఎన్నో చిత్రాలలో అవకాశాలు అందుకుని మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈయన తన కామెడీ టైమింగ్ తో ఎంతోమంది ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. అయితే సినీ ఇండస్ట్రీలో ఉండే వారి జీవితం ఎప్పుడు ఎలా మారుతుందనే విషయం చెప్పలేము.. కొంతమంది జీవితంలో అదృష్టం తలుపు తడితే రాత్రి రాత్రికి సెలబ్రిటీలు అయిన వారు కూడా ఉన్నారు.


అదేవిధంగా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో కమెడియన్ గా గుర్తింపు పొందిన గుండు హనుమంతరావు బ్రహ్మానందం, ఆలీ, కోట శ్రీనివాసరావు తర్వాత అంతటి కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అయితే కెరియర్ సాఫీగా సాగుతున్న సమయంలో తన జీవితంలో దురదృష్టం ఒక్కసారిగా తలుపు తట్టి తన భార్య కూతురిని ఇద్దరిని కూడా పోగొట్టుకున్నారు.. దీంతో ఒక్కసారిగా గుండు హనుమంతరావు కృంగిపోయారు. కేవలం తన కొడుకు కోసమే గుండు హనుమంతరావు తన జీవితాన్ని కొనసాగించేవారు. అలా తన కొడుకు ఉన్నత చదువుల కోసం విదేశాలకు పంపించి తాను సంపాదించిన మొత్తాన్ని కూడా తన కొడుకు చదువులకే ఖర్చు చేసేవారట.


అయితే సరిగ్గా భోజనం ఆరోగ్యాన్ని మెయింటైన్ చేయలేక కిడ్నీ వ్యాధితో ఇబ్బంది పడేవారు.. అలా ఉన్న డబ్బు మొత్తం తన కొడుకు చదువుల పేరిట పెట్టడం వల్ల తన ఆరోగ్యం క్షీణించడం జరిగిందట. తన దగ్గర ఉన్న డబ్బు మొత్తం తన కుమారుడు చదువుకోసమే కూడా పెట్టే వారిని అలా తన ఆరోగ్యాన్ని సైతం నిర్లక్ష్యం చేసి దీన్నస్థితిలో మరణించారు గుండు హనుమంతరావు. ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న తన కష్టాలను మాత్రం ఎవరికీ చెప్పేవారు కాదట. గతంలో ఒక ప్రముఖ ఛానల్లో ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన ఈ విషయాలను కమెడియన్ ఆలీతో ఈ విషయాలన్నీ చెప్పడంతో ఆయన చెల్లించిపోయి తన కొడుకు ఉద్యోగ బాధ్యతలను తాను తీసుకుంటానని కూడా ఆలి హామీ ఇచ్చారట. చివరికి గుండు హనుమంతరావు ఎంత సంపాదించిన ఆర్థిక ఇబ్బందులు ఎదురై మరణించారు

మరింత సమాచారం తెలుసుకోండి: