సినీ ఇండస్ట్రీ అనేది ఒక రంగుల ప్రపంచం అంతా కూడా ఒక మాయా లోకం అని కూడా చెప్పవచ్చు.ఇందులో ఎవరు ఎలా రంగులు మారుస్తూ ఉంటారనే విషయం చెప్పలేము.. ఇండస్ట్రీకి చెందిన చాలామంది నటీనటులు సైతం ఈ విషయాన్ని ఎన్నోసార్లు చెబుతూ ఉంటారు. మరి కొంతమంది ఇలాంటి విషయాలలో బలైన సంఘటనలను కూడా ఓపెన్ గా తెలియజేస్తూ ఉంటారు. అలా సినీ ఇండస్ట్రీలోకి వచ్చి అతి తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ అర్చన కూడా హీరోయిన్గా తన కెరీర్ ని ఎక్కువకాలం నిలబెట్టుకోలేకపోయింది. బుల్లితెర పైన మాత్రం వరుసగా సీరియల్స్ లో నటిస్తూ ఉన్నది.


అందానికి అందం అభినయం ఉన్నప్పటికీ.. నటనపరంగా డాన్స్ పరంగా ఇలా అన్ని క్వాలిటీస్ ఉన్నప్పటికీ ఈమె ఇండస్ట్రీలో అవకాశాలు సంపాదించుకోలేకపోయింది.. చూడగానే హీరోయిన్ మెటీరియల్ లా కనిపించే అర్చన ఇండస్ట్రీలో హీరోయిన్గా సెట్ కాలేకపోయింది. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో ఈమె మాట్లాడుతూ తన కెరియర్ పడిపోవడానికి ముఖ్య కారణం ఒక స్టార్ హీరోయిన్ అంటూ పరోక్షంగా తెలియజేసింది.

ఆమె ఎవరో కాదు హీరోయిన్ త్రిష.. ఈ విషయాన్ని అప్పట్లో అర్చన అభిమానులు కూడా మాట్లాడుకునేవారు.. ప్రభుదేవా డైరెక్షన్లో వచ్చిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలో అర్చన సెకండ్ హీరోయిన్ పాత్రని కానీ ఫైనల్ గా ఆమెది ఫ్రెండ్ పాత్రగా చేశారని తెలుస్తోంది.. ఈ సినిమాలో త్రిష కంటే అర్చన అనే చాలా సూపర్ గా నటించిందని చాలామంది ఇప్పటికీ చెబుతూ ఉంటారు. అయితే ఈ సినిమాలో కొన్ని మంచి మంచి సీన్స్ అర్చనకు సంబంధించి తీసేసారట.ఆ కారణంగానే ఈమె సపోర్టింగ్ పాత్రగా మిగిలిపోయిందట.. అలా ఈ సినిమా చూసిన వారందరూ కూడా అర్చనకు ఎక్కువగా సపోర్టింగ్ రోల్సే ఇచ్చారట. హీరోయిన్గా ఆమెకు అవకాశాలు కనుమరుగయ్యాయి.. దీంతో అలా పరోక్షంగా తన కెరీయర్ని నాశనం అవ్వడానికి త్రిషనే కారణమని అర్చన అభిమానులు తెలుపుతున్నారు. ప్రస్తుతం బుల్లితెర పైన పలు సీరియల్స్ లో నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: