సీరియల్ అంటే ఇష్టం ఉండని వారు ఎవరూ ఉండరు. ముఖ్యంగా ఆడవారు వీటిని ఎక్కువగా చూస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో కాస్త మగవాళ్ళు కూడా సీరియల్స్ ను ఎక్కువగా చూస్తున్నారు.. సినిమాలకు మించి ట్విస్టు ఉండడంతో ఎన్నో సంవత్సరాలుగా సీరియల్ హవ కొనసాగిస్తూనే ఉన్నాయి.. బ్రహ్మముడి లాంటి సీరియల్ కు భారీగానే క్రేజ్ ఉన్నది. ఈ సీరియల్లలో నటించిన నటీనటులకు కూడా భారీగానే క్రేజ్ ఏర్పడింది.ముఖ్యంగా ఇందులో అప్పుగా కూడా నటించిన అమ్మాయికి మంచి క్రేజ్ ఏర్పడింది.


వాస్తవానికి బ్రహ్మముడి నాటికలో నటించిన అప్పు అసలు పేరు నైనిషా రామ్.. ఇందులో మగరాయుడిగా కనిపిస్తూ అందరిని అలరిస్తుంది. నిజజీవితంలో ఎన్నో కష్టాలను కూడా ఇమే అనుభవించిందని తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది నైనిషా రామ్. అనుకోకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చానని ఇంటర్ చదువుతున్న సమయంలోనే తనకు అవకాశాలు వచ్చాయంటూ తెలియజేసింది. సీరియల్స్ పైన ఇంట్రెస్ట్ లేకుండానే సీరియల్స్ లో నటించానని కానీ ఇప్పుడు ఫేమ్ రావడంతో బ్రేక్ కూడా తనకు దొరకడం లేదంటూ తెలియజేసింది..


అలాగే తన తల్లితండ్రులకు దూరంగా ఉండడం చాలా ఇబ్బందిగా ఉందని ఫ్యామిలీకి దూరమైన తర్వాత నాలుగేళ్ల వరకు ఎన్నో ఇబ్బందులు కూడా పడ్డానని వెల్లడించింది.. క్యాస్టింగ్ కౌచ్ గురించి తెలియజేస్తూ నైనిషా రామ్.. చిన్న ఏజ్ లోనే క్యాస్టింగ్ కౌచ్ తో చాలా ఇబ్బంది పడ్డానని మేనేజర్ ఛాన్స్ కావాలంటే కమీట్మెంట్లు అడిగారని కానీ నాకు కమిట్మెంట్ అంటే తెలియదు.. కానీ తెలిసిన కమిట్మెంట్ అంటే ఏదైనా మనం సాధించాలని కష్టపడి పని చేయాలనుకున్నా.. వారు కమిట్మెంట్ అంటే అదేనేమో అనుకున్నానని అందుకు ఓకే చెప్పానని షూటింగ్ రెండు రోజులు ఉందనగా తనని చాలా ఇబ్బంది పెట్టారని.. దీంతో వాళ్ళని తాను కొట్టానని కూడా తెలియజేసింది.. దీనివల్ల చాలామంది తనను ప్రాబ్లమ్స్ గురి చేశారని ఏడు నెలల పాటు డిప్రెషన్ లోకి వెళ్లిపోయారని ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒక ప్రాబ్లమ్స్ సృష్టిస్తూనే ఉన్నారు.. దీంతో తన బాయ్ ఫ్రెండ్ కూడా వదిలేసారని తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: