తెలుగు సినీ ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ గా, నటీమణిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో మధురిమ నార్ల కూడా ఒకరు.. ఇమే కేవలం నటించింది కొన్ని చిత్రాలలో అయిన ఎక్కువగా బాలకృష్ణ సినిమాలలో నటించానంటూ ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పలు విషయాలను తెలియజేసింది మధురిమ నార్ల. బాలకృష్ణ ను ఎక్కువగా తాను మామయ్య అని పిలుస్తూ ఉంటానని తెలియజేస్తోంది. ఈ విషయంలో తనని చాలా ప్రేమగా కూడా చూసుకునే వారిని తెలియజేస్తోంది ఈ ముద్దుగుమ్మ.


అలాగే బాలకృష్ణ సినిమా షూటింగ్ సమయంలో ఎంత ఫర్ఫెక్ట్ గా ఉంటారో కాస్త సమయం దొరకగానే అంతే జోవియల్ గా అందరితో కలిసి పోతారని తెలియజేస్తోంది. అందుకే ప్రతి సన్నివేశంలో కూడా ఎంతో అద్భుతంగా బాలకృష్ణ నటిస్తారని తెలిపింది. సినిమా షూటింగ్ సమయాలలో కాస్త సమయం దొరికితే అక్కడ ఉన్న వారందరితో బాలయ్య పేకాట ఆడుతూ ఉంటారని కూడా తెలియజేసింది. ఎలాంటి సన్నివేశంలో నటించాల్సి వచ్చినా కూడా పూర్తిగా మారిపోయే వారిని తెలియజేస్తోంది మధురిమ.


ముఖ్యంగా ఏదైనా సన్నివేశం చేయాలి అంటే ఆ సన్నివేశం పూర్తి అయ్యేవరకు బాలయ్య మాట్లాడారని తెలిపింది. అలాగే సీనియర్ ఎన్టీఆర్ గురించి ఎక్కువగా మాట్లాడే వారిని తెలుపుతోంది. మరొక నటుడు మురళీమోహన్ కూడా చాలా వ్యాపారాలు చేస్తున్నప్పటికీ ఆర్టిస్టుగా కొనసాగే వారిని.. ఆర్టిస్టుగా వచ్చినటువంటి గుర్తింపు డబ్బులు ఉన్న గుర్తింపు రాదని చెప్పేవారని తెలుపుతోంది. మనం ఉన్నా లేకపోయినా సరే సినిమాలలో నటిస్తే ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని గుర్తుపెట్టుకుంటారని మురళీమోహన్ తరచు మధురిమతో చెప్పేవారట. తనను కూడా ఎన్నోసార్లు ఎందుకు సినిమాలు తగ్గించావని ప్రశ్నించే వారిని తెలుపుతోంది మధురిమ నార్ల. యశోద ,శతమానం భవతి, పెద్దన్నయ్య తదితర చిత్రాలలో నటించింది ముఖ్యంగా ఈమెకు ఒరేయ్  రిక్షాలో నటించిన పాత్రకు మంచి పాపులారిటీ వచ్చిందని కూడా తెలియజేసింది. అలా ఎన్నో అవకాశాలు కూడా వచ్చాయని తెలిపింది. ప్రస్తుతం ఇమే చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: