గత కొన్ని నెలల నుంచి ఎక్కువగా వెండితెర బుల్లితెర అని తేడా లేకుండా సెలబ్రిటీల సైతం విడాకులు బాట పడుతున్నారు.. గడిచిన రెండు రోజుల క్రితం కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ నటుడు జీవి ప్రకాష్ కుమార్ కూడా తన భార్య నుంచి విడిపోయారు.. తమ 11 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి పలికినట్లుగా ఇటీవలే వెల్లడించారు.. ఇప్పుడు తాజాగా బుల్లితెర నటి శిరీష సైతం తన భర్త నుంచి విడిపోయినట్లుగా ప్రకటించి అందరికీ ఒక్కసారిగా షాక్ ఇచ్చింది..


మొగలిరేకులు సీరియల్స్ తో మంచి గుర్తింపు సంపాదించుకున్న శిరీష బ్యాక్ టు బ్యాక్ పలు సీరియల్స్ లో నటించింది.. మొగలిరేకులు తరువాత స్వాతి చినుకులు, రాములమ్మ ,మనసు మమత, చెల్లెలి కాపురం, నాతిచరామి తదితర సీరియల్స్ లో నటించింది. తనకి కెరియర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే శిరీష నవీన్ వల్లభనేని వివాహం చేసుకున్నది.. అయితే ఈ జంటకు శ్రీ ఈష్ అనే బాబు కూడా జన్మించారు. ఇదంతా ఇలా ఉండగా తాజాగా శిరీష తన భర్త నుంచి విడాకులు తీసుకున్నట్లు ఒక పోస్టుని తెలియజేసింది.


ఇందులో తన అభిమానులు మరియు శ్రేయోభిలాషులతో తన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంది. నవీన్ మరియు తాను ఒకప్పుడు భార్యాభర్తలుగా ఉన్నామని ప్రస్తుతం పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల విడిపోతున్నామని తెలియజేసింది. ఇలాంటి సమయంలో మమ్మల్ని అర్థం చేసుకొని మా విలువలకు గౌరవం ఇస్తారని కోరుకుంటున్నాను అంటూ తెలియజేసింది. ఎవరు కూడా విమర్శలు చేయవద్దని ప్రేమ, దయ చూపండి అంటూ తెలియజేసింది శిరీష.. తనకు నవీన్ పట్ల గౌరవం తప్ప మరేమీ లేదని ప్రజలు కూడా ఈ దృష్టిలో నే చూడాలని తెలియజేసింది.. ఈ వార్తను మీ అందరితో పంచుకోవడం చాలా ముఖ్యం అనుకొని పంచుకుంటున్నానని తెలిపింది. చివరిగా మీరు మాపై చూపించే ఈ ప్రేమకు సైతం ఎప్పుడు ధన్యవాదాలు అంటూ తెలియజేసింది శిరీష. ప్రస్తుతం అందుకు సంబంధించి పోస్టు వైరల్ గా మారుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: