జబర్దస్త్ లో కమెడియన్ గా ముక్కు అవినాష్ గురించి ప్రత్యేకంగా తెలియజేయాల్సిన పనిలేదు.. ప్రస్తుతం అవినాష్ స్టార్ మా చానల్లో ప్రసారమయ్యేటువంటి పలుషోలలో కనిపిస్తూ ఉన్నారు. గతంలో జబర్దస్త్ కమెడియన్ గా మంచి పాపులారిటీ సంపాదించుకున్న అవినాష్.. బిగ్ బాస్ లో అవకాశం రావడంతో దాదాపుగా కొన్ని లక్షల రూపాయలు కట్టి మరి జబర్దస్త్ నుంచి బయటికి వచ్చి బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. కానీ పెద్దగా కలిసి రాలేదని చెప్పవచ్చు. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అవినాష్ పలు విషయాలను వెల్లడించారు.
అవినాష్ మాట్లాడుతూ తను బాల్యం నుంచి హాస్టల్లో చదువుకున్నానని చదువు పరంగా బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ కూడా చదివానని.. డబ్బుల కోసం కిరాణా షాప్ లో కూడా పనిచేశానని ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఆఫీస్ బాయ్గా కూడా పనిచేశానని వెల్లడించారు.. ఎగ్జామ్ ఫీస్ తప్ప ఫ్యామిలీ మెంబర్స్ని డబ్బులను ఎక్కువగా అడిగేవాడిని కాదని కాలేజీ కంటే సినిమా ఆఫీసులో చుట్టూనే ఎక్కువగా తిరిగానని వెల్లడించారు అవినాష్ తాను జబర్దస్త్ టీమ్ లీడర్ గా పనిచేస్తున్న సమయంలో తన పైన తనకి అప్పుడు నమ్మకం వచ్చింది అంటే తెలిపారు.


చాలా సందర్భాలలో భోజనం తినకుండానే పడుకున్న సందర్భాలు ఉన్నాయని.. అలాంటి కష్టాల నుంచి అధిగమించి ప్రస్తుతం అందరితో కాస్త సంతోషంగా ఉన్నానని తెలిపారు.. తన కెరియర్లో ఎవరికైనా రుణపడి ఉన్నానంటే అది కేవలం యాంకర్ శ్రీముఖి కే అంటూ వెల్లడించారు ముక్కు అవినాష్.. జబర్దస్త్ షో ద్వారా తమకు మిగిలేది ఏమీ లేదని.. డబ్బుల కోసం విదేశాలకు వెళ్లి కూడా కొన్నిసార్లు స్కిట్లు చేశామని కూడా తెలియజేశారు.. చదువుకునే సమయంలో కూడా చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నానని కొన్నిసార్లు సినిమా చూడడానికి డబ్బులు లేక గోడ దూకి మళ్ళీ దొంగగా థియేటర్లో కూర్చొని చూసిన సందర్భాలు ఉన్నాయని కూడా అవినాష్ వెల్లడించారు. ప్రస్తుతం అవినాష్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: