తెలుగు బుల్లితెరపై ప్రసారమయ్యేటువంటి కార్యక్రమాలలో జబర్దస్త్ కార్యక్రమం కూడా ఒకటి. ఈ షో మంచి సక్సెస్ ని సైతం అందుకుంది. ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమంది కమెడియన్స్, హీరోలు డైరెక్టర్ల సైతం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే ఇందులో కమెడియన్ గా సక్సెస్ అయిన వారిలో హైపర్ ఆది కూడా ఒకరు. తన కెరియర్ మొదట్లో అదిరే అభి టీంలో కమెడియన్ గా చేసేవారు. ఆ తర్వాత స్క్రిప్ రైటర్ గా మారి.. అనంతరం టీమ్ లీడర్ గా కూడా మారి మంచి సక్సెస్ ని అందుకున్నారు హైపర్ ఆది.


హైపర్ ఆది రైజింగ్ రాజు టీమ్ ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నారు. అదిరే అభి దగ్గర పని చేసినటువంటి హైపర్ ఆది పక్కకు వెళ్లిపోవడంతో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయని వార్తలు వినిపించాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో అదిరే అభి మాట్లాడుతూ హైపర్ ఆదితో తనకు విభేదాలు గురించి వచ్చిన విషయాల పైన మాట్లాడారు. ఈ సందర్భంగా అబి మాట్లాడుతూ హైపర్ ఆది నా టీమ్ నుంచి వెళ్ళిపోవడానికి ఎలాంటి విభేదాలు లేవని తెలియజేశారు.


కొత్త టీమ్స్ ఏర్పాటు చేయడం కోసమే రెండవ స్థానంలో ఉన్నటువంటి వారిని మల్లెమాల తీసుకుందని ఆ విధంగా తన టీమ్ నుంచి హైపర్ ఆది బయటకు వెళ్లిపోయారని అంతకుమించి ఏం జరగలేదని తెలియజేశారు. జబర్దస్త్ కార్యక్రమంలో ఎంతో మంది సక్సెస్ అయి మంచి పొజిషన్లో ఉన్నారని హైపర్ ఆది కూడా ప్రస్తుతము అలాంటి పొజిషన్లో ఉన్నారని తెలిపారు. మరొకవైపు సినిమాలలో కూడా నటిస్తున్నారని కూడా తెలియజేశారు.. గతంలో అదిరే అభి పలు చిత్రాలలో నటించినప్పటికీ ఈమధ్య కాలంలో అటు బుల్లితెర పైన వెండితెర పైన అసలు కనిపించడం లేదు. మరి రాబోయే రోజుల్లో తిరిగి బుల్లితెర మీదికి రీఎంట్రీ ఇవ్వాలని అభిమానులైతే కోరుకుంటున్నారు. హైపర్ ఆది మాత్రం వరుస సినిమాలతో దూసుకుపోతూ బిజీ యాక్టర్ గా మారిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: