బిగ్ బాస్ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న వారిలో నటి గాయత్రి గుప్తా కూడా ఒకరు.. ఈమెకు తెలుగులో ఎన్నో చిత్రాలలో అవకాశాలు కూడా లభించాయి. తెలుగమ్మాయి అవ్వడం చేత ఈమె ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. గాయత్రి గుప్తా ఎప్పుడు కూడా నిరంతరం ఏదో ఒక విషయంలో వైరల్ గా మారుతూ ఉంటుంది. ఫిదా సినిమాలో సాయి పల్లవి ఫ్రెండ్ గా నటించి మంచి మార్కుల సంపాదించుకుంది.ఆ తర్వాత వరుస సినిమాలో అవకాశాలు వెలుపడ్డాయి. ముఖ్యంగా బుర్రకథ, ఐస్ క్రీమ్-2, దుబాయ్ రిటర్న్ తదితర చిత్రాలలో నటించింది
అయితే చాలా గ్యాప్ తర్వాత దయా అనే వెబ్ సిరీస్ తో డిజిటల్ ఎంట్రీ కూడా ఇచ్చింది గాయత్రి గుప్తా. తాజాగా ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇమే క్యాస్టింగ్ కౌచ్ పోరాటాన్ని చేస్తున్న సమయంలో తనకి ఎవరు సపోర్టు చేయలేదని ఆ తర్వాత కొంతమంది తనలాగా పోరాడడం వల్ల ఇండస్ట్రీ స్పందించి ఒక కమిటీ కూడా వేశారని తెలియజేసింది. ఆ సమయంలోనే చాలామంది బాధితులను కూడా గుర్తించారని కూడా తెలియజేసింది. ఇండస్ట్రీలో ఇప్పటికీ కూడా క్యాస్టింగ్ కౌచ్ ఉందనే విషయాన్ని చాలా బలంగా చెబుతున్నానని తెలిపింది గాయత్రి గుప్తా.


చాలామంది హీరోయిన్స్ అవకాశాల కోసం ఇష్టంతో సెక్స్ చేస్తున్నారని కొంతమంది అవసరాల కోసం ఇలాంటి వాటిని ఒప్పుకోక తప్పలేదని తెలియజేస్తోంది. అయితే ఇందులో ఎక్కువమంది అమాయకపు అమ్మాయిలే బలవుతున్నారనే విధంగా తెలియజేసింది. ఈ మధ్యన గాయత్రి గుప్తా కూడా డిప్రెషన్ వలన ఆర్థరైటిస్ అనే వ్యాధితో పోరాడుతున్నట్లుగా తెలియజేసింది.అయితే ఈ వ్యాధి ఇప్పుడు ముదిరిపోయిందని ట్రీట్మెంట్ కోసం 12 లక్షల రూపాయలు ఖర్చు అవుతోంది అంటూ తెలియజేసింది. ఇప్పటి వరకు సుమారుగా 15 లక్షల రూపాయలకు పైగా ఖర్చు చేశానని ఎవరైనా దాతలు ఉంటే సహాయం చేయాలని తెలియజేస్తోంది గాయత్రి గుప్తా.

మరింత సమాచారం తెలుసుకోండి: