మొదట జబర్దస్త్ కమెడియన్గా మంచి పాపులారిటీ సంపాదించుకున్న వేణు ఆ తర్వాత పలు చిత్రాలలో కూడా నటించి తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. కొద్దిరోజులు సినిమాలకు గ్యాప్ ఇచ్చి బలగం సినిమాతో డైరెక్టర్ గా మారి మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ గా పేరు సంపాదించారు కమెడియన్ వేణు.. అప్పటినుంచి తన పేరు బలగం వేణు గా మారిపోయింది. దాదాపుగా 25 ఏళ్ల క్రితం సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వేణు కెరియర్ మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేశానని ఆ తర్వాత చిన్న చిన్న రూల్స్ చేసుకుంటూ తన కెరీర్ ని ఉన్నత స్థాయికి ఎదిగేలా చేసుకున్నారు.


ముఖ్యంగా ప్రభాస్ నటించిన మున్నా సినిమాలో తన కామిడి టైమింగ్ తో మంచి పాపులారిటీ సంపాదించుకోవడంతో ఆ తర్వాత రవితేజ నటించిన ఖతర్నాక్ సినిమాతో కూడా మరింత క్రేజ్ ను అందుకున్నారు. ప్రస్తుతం డైరెక్టర్గా సినిమాలు తెరకెక్కించడానికి సిద్ధమయ్యారు. అయితే వేణు సినిమాలోకి రాకముందు ఏం చేసేవారని విషయానికి వస్తే వేణు చేసిన పని తెలిస్తే అందరూ ఆశ్చర్యపోతారు.. వేణు తల్లిదండ్రులు కూరగాయలు అమ్మేవారిని అప్పట్లో పావలా కొత్తిమీర అమ్మాలి అంటే చాలా మాటలు చెప్పి అమ్మేవారిని అలాంటి సమయంలోనే తాను అలాంటి పని చేసి చదువుకుంటూ ఉండేవాడిన అని తెలిపారు.


అయితే వేణు అన్నిటిలో కంటే చాలా ప్రత్యేకంగా ఉండాలని మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకున్నానని తెలిపారు. అందులో రెండు సార్లు స్టేట్ చాంపియన్ అని కూడా. ఆ సమయంలోనే సినిమాల పైన ఆసక్తి రావడంతో ఏ సినిమా విడుదలైన చూసేవాడినని అందరూ తనని బాబు మోహన్ బావమరిది అంటూ పిలిచేవారని దీంతో తనకి కూడా ఆనందం పెరిగిపోయి ఇండస్ట్రీలోకి వెళ్ళాలని ఇంటి నుంచి వచ్చేసానని తెలిపారు వేణు.. కెరియర్ మొదట్లో నవకాంత్  అనే రచయిత దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేశారని ఆ తర్వాత చిత్రం శీను కోసం అసిస్టెంట్ డైరెక్టర్గా వెతుకుతున్నారని తెలిసి ఒక వ్యక్తి ద్వారా అక్కడ జాయిన్ అయి రెండు సంవత్సరాలు అక్కడే పనిచేశానని తెలిపారు. ఆ తర్వాత ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చానని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: