తెలుగు బుల్లితెర పైన కొన్ని జంటలు చూడడానికి చూడముచ్చటగా ఉండడమే కాకుండా ఎక్కువగా హైలెట్ అయిన జంటలు కూడా ఉన్నాయి. అలాంటి వారిలో నవ్య స్వామి, రవికృష్ణ జంట కూడా ఒకటి. వీరిద్దరూ కలిసి నటించిన సీరియల్స్ లో ప్రేమలో పడ్డారని ఎప్పటినుంచో వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా అందుకు గల కారణం వీరిద్దరూ కలిసి తరచూ కనిపిస్తూ ఉండడమే. తాజాగా రవికృష్ణ నవ్య స్వామి తో పెళ్లి పై క్లారిటీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది వాటి గురించి చూద్దాం.


నవ్య స్వామి మొదటిసారిగా మోడల్గా తన కెరీయర్ని సైతం ప్రారంభించి ఆ తర్వాతే యాక్టర్ గా అడుగుపెట్టింది.. మొదట కన్నడలో ఎన్నో సీరియల్స్ లో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఈ క్రమంలోనే తెలుగులో కూడా ఈమె ఎంట్రీ ఇవ్వడంతో పాటు భారీ క్రేజ్ సంపాదించుకుంది. బుల్లితెర నటుడు రవి కృష్ణ విషయానికి వస్తే చిన్న చిన్న పాత్రలు సీరియల్స్ లో నటిస్తూ మొగలిరేకులు సీరియల్ ద్వారా మరింత క్రేజీని సంపాదించుకున్నారు. ఆ తరువాత ఎన్నో సీరియల్స్ లో కూడా నటించి పాపులారిటీ అందుకున్నారు రవి కృష్ణ.


అలాగే హీరోగా కూడా సినిమాలలో నటించారు. రవికృష్ణ, నవ్యస్వామి కలిసి "ఆమె కథ" అనే ఒక సీరియల్ లో జంటగా నటించారట.. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య ప్రేమ ఉందని ప్రచారం అయితే జరుగుతోంది.త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారని విషయం వినిపిస్తూనే ఉంది. వీరి లవ్ ట్రాక్ ను క్యాష్ చేసుకొని ఎన్నో షోలు పలు రకాల చానల్స్ నిర్వహించాయి. రవి కృష్ణ వీరుపాక్ష అనే చిత్రంలో కూడా నటించారు. ఇటీవల రవికృష్ణ ఒక ఇంటర్వ్యూలో నవ్య స్వామి గురించి మాట్లాడుతూ.. నవ్య స్వామి తనకు మంచి స్నేహితురాలు అంటూ తెలియజేశారు.గతంలో నవ్య స్వామి తో కలిసి చేసిన రొమాన్స్ స్కిట్లన్నీ  కేవలం అవన్నీ స్కిట్స్ కోసమే చేశామని తామద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ లేదని తెలిపారు. ఈ విషయంలో తామిత్తరము క్లారిటీ గానే ఉన్నామని తెలిపారు. దీంతో అభిమానుల సైతం కాస్త నిరాశలో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: