తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు సుధీర్, రష్మీ జంట గురించి చెప్పాల్సిన పనిలేదు. జబర్దస్త్ ద్వారా ఎన్నో స్కిట్లను చేసి మంచి పాపులారిటీ సంపాదించుకొని బుల్లితెర పైన బెస్ట్ కపుల్ గా పేరు సంపాదించారు. వీరిద్దరూ కలిసి బుల్లితెర పైన కనిపిస్తే ఆడియన్స్ లో వచ్చే జోరు అంతా ఇంతా కాదు. వీరిద్దరి మధ్య గత కొన్నేళ్లుగా సంథింగ్ సంథింగ్ అన్నట్లుగా పలు రకాల రూమర్స్ కూడా ఎక్కువగా వినిపించాయి. కానీ వీరిద్దరూ మాత్రం తమ మధ్య ఎలాంటి రిలేషన్ లేదని.. కేవలం స్నేహితులం మాత్రమే అంటు తెలియజేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.


అయితే ఇటీవలే రష్మీ, సుడిగాలి సుదీర్ మధ్య కొన్ని గొడవలు కూడా జరిగాయనే ప్రచారం జరుగుతోంది. వీటిపైన తాజాగా యాంకర్ రష్మీ స్పందిస్తూ క్లారిటీ ఇచ్చింది. జబర్దస్త్ షోకి యాంకర్ గా వచ్చినప్పటి నుంచి సుధీర్ కి రష్మీతో మంచి అనుబంధం ఏర్పడిందట. అలా ఒకవైపు సినిమాలలో జబర్దస్త్ తో అందరినీ ఆకట్టుకున్న రష్మి అప్పుడప్పుడు సుడిగాలి సుదీర్ తో కలిసి కామెడీ షోలలో కూడా కనిపిస్తూ ఉండేది. సుధీర్ కమెడియన్స్ స్థాయికి చేరుకున్న తరువాత రష్మితో ప్రేమలో పడ్డారంటూ వార్తలు కూడా వినిపించాయి.


అయితే వీరిద్దరూ ఆన్ స్క్రీన్ లోనే కాదు ఆఫ్ స్క్రీన్ లో కూడా జంటగా పేరు బాగానే సంపాదించారు. ముఖ్యంగా రష్మితో గొడవలు వల్లే సుదీర్ బుల్లితెర పైన కనిపించడం లేదంటే వార్తలు వినిపిస్తున్న తరుణంలో తాజాగా రష్మీ  ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సుధీర్ కి తనకు ఎలాంటి గొడవలు లేదని తమ మధ్య వచ్చే రూమర్లను అసలు పట్టించుకోమని తెలిపింది.  తాము ఏదైనా ఈవెంట్లో కలుస్తూ ఉంటామని తెలియజేస్తుంది. అలా అందరూ కూడా ఒకే దగ్గర పని చేయవలసి ఉంటుంది కనుక కోపతాపాలకు  స్థానం ఉండదని తెలిపింది. మొత్తానికి తమ మధ్య గొడవలు అంటూ వచ్చిన రూమర్స్ కి క్లారిటీ ఇచ్చింది రష్మి.

మరింత సమాచారం తెలుసుకోండి: