ఎండమావులు, పద్మ వ్యూహం తదితర సీరియల్లలో నటించి మంచి పాపులారిటీ సంపాదించిన నటుడు ఇంద్ర నాగ్ అతి తక్కువ సమయంలోనే బుల్లితెరకు దూరమయ్యారు. అయితే చాలాకాలం తర్వాత మళ్లీ ఇటీవలే కెమెరా ముందుకు వచ్చిన ఇంద్రనాగ్ ఈ సందర్భంగా ప్రముఖ బుల్లితెర నటుడు ప్రభాకర్ తో ఉన్న గొడవల గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.



ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇంద్ర నాగ్ మాట్లాడుతూ తన అసలు పేరు నాగేంద్ర అని తమది తూర్పుగోదావరి అంటూ తెలిపారు. ఇండస్ట్రీలోకి  అనుకోకుండా వచ్చానని.. కన్నడ సినీ పరిశ్రమలో తనకి సినిమాలలో నటించే అవకాశం వచ్చినప్పటికీ భాష పరంగా కష్టంగా ఉండడంతో తాను చేయలేకపోయానని తెలిపారు. చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్నాను తన మామయ్య కూతురు కావడం చేత పెళ్లి చేసుకున్నానని ఆ సమయంలోనే తమకు ఒక పాప కూడా పుట్టింది.. అప్పుడు తన భార్యకే 16 సంవత్సరాలు.. తానకి 24 ఏళ్లు ఆ సమయంలోనే ఇండస్ట్రీలోకి వచ్చాను..నటుడు గా  అప్పుడు  రోజుకి రూ.1500 రూపాయలు పారితోషకం ఇచ్చేవారని.. డైరెక్టర్ గా చేసినప్పుడు రోజుకి రూ.15000 రూపాయలు తీసుకున్నానని తెలిపారు.


ఇక బుల్లితెర నటుడు ప్రభాకర్ తో తనకు ఎలాంటి గొడవలు లేవని.. తను చాలా సీనియర్ నటుడు.. తను మొదటి నుంచి నాతో ఎక్కువగా మాట్లాడారని నేను మాత్రం ఆయనని గౌరవిస్తూనే ఉన్నానని.. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడిన మాటలు చూసిన తరువాతే నా మీద అతనికి కోపం ఉందని విషయం తెలిసింది అంటు తెలిపారు ఇంద్రనాగ్. అలాంటి వాటికి తానేమి చేయలేనని ఈ విషయాలన్నీ లైట్గా తీసుకొని వదిలేయాలని తెలిపారు. కరోనా తరువాత నాలో చాలా మార్పులు వచ్చాయని కొంతమేరకు డిప్రెషన్ కు మారిపోయానని ప్రతిదాన్ని లోతుగా ఆలోచిస్తూ ఉండేవాడిని అంటూ తెలిపారు. తెలుగులో కూడా కొన్ని చిత్రాలలో నటించిన ఇంద్రనాగ్.. ప్రస్తుతం నిండు మనసులు అనే సీరియల్ నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: