
స్మృతి ఇరానీ మాట్లాడుతూ తాను బుల్లితెర పై అందరికంటే ఎక్కువగా రెమ్యూనరేషన్ పొందుతున్న నటినని గతంలో కూడా ఈ సీరియల్స్ ద్వారా ప్రేక్షకదారణ బాగా పొందాను రేటింగ్ పరంగా కూడా టాప్ స్థానంలో ఉన్నది. అలాంటప్పుడు నటీనటులకు కావలసిన రెమ్యూనరేషన్ అందుకోవడం కూడా సహజమే అంటూ తెలియజేసింది. తాము ఏ విషయాలనైనా సరే కాంట్రాక్టర్లతోనే మాట్లాడుకొని ఒబ్బందాలు చేసుకుంటామని.. తాను కూడ యూనియన్ సభ్యురాలను కాబట్టి తనకు ఒక నెంబర్ అనేది ఉంటుంది దాని ఆధారంగానే పారితోషకం తీసుకుంటానని తెలిపింది.
అందుకే చాలామంది నటీమణులు తనను చూసి స్ఫూర్తి పొందుతారని ఇది కేవలం నటనలో మాత్రమే భాగం కాదు ఒక బాధ్యత అంటూ తెలియజేసింది స్మృతి ఇరానీ. కానీ తాను తీసుకొనే రెమ్యూనరేషన్ నెంబర్ మాత్రం రిలీవ్ చేయలేదు. సుమారుగా 25 సంవత్సరాల క్రితం క్యోంకీ సాస్ భీ కభీ బహు థీ సీరియల్లో తులసి పాత్రలో నటించింది. అందులోని పాత్ర పాపులారిటీ కావడంతో ఎనిమిదేళ్ల వరకు విజయవంతంగా సీరియల్ ప్రసారమయింది. తులసి పాత్రకు స్మృతి ఇరానీకి ఎన్నో అవార్డులను కూడా అందుకున్నది. జియో సినిమా, స్టార్ ప్లస్ ఛానల్లో కూడా ప్రసారమవుతుందని తెలుస్తోంది. స్మృతి ఇరానీ బుల్లితెరపై రీఎంట్రీ కూడా చాలా ఘనంగానే చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ సీరియల్ పై అభిమానులు మరింత ఎక్సైటింగ్ గా ఎదురు చూసేలా చేసిందని చెప్పవచ్చు.