చండీగఢ్‌ లో ఇకపై ప్రజలు ఎవరైనా సరే నీటిని వృథా చేస్తే వారిపై రూ.2వేల జరిమానా వేస్తారు. అయినప్పటికీ వారు వినక పోతే, వారి నీటి కనెక్షన్‌ను కట్‌ చేస్తారు. ఇటీవల ఈ కొత్త రూల్‌ అక్కడ అమలులోకి వచ్చింది. నేల పై రాలే ప్రతీ చినుకును ఒడిసి పట్టక పోతే, పై లిస్టులోకి మిగతా దేశాలు చేరడానికి ఎంతో కాలం పట్టదు. అని హెచ్చరిస్తున్నారు జలనిపుణులు.

నీటి వనరుల్ని సరైన రీతిలో ఉపయోగించుకోలేక పోవడం వల్ల మన దేశంలో దాదాపు రెండు లక్షల గ్రామాలు దారుణమైన కరవును ఎదుర్కొంటున్నాయి. ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం- దేశంలోని భూగర్భజలాల్లో 70 శాతం నీటిని రైతులు వ్యవసాయానికే వాడుతున్నారు.

ఇవీ వాన నీటి లెక్కలు

ఈరోజు 20 మిల్లీమీటర్ల వర్షం కురిసింది, 30 మి. మీ లేదా 50 మి. మీ. వర్షం కురిసింది అని వార్తా పత్రికలలో చదువుతుంటాము దీని అర్థం ఏమిటి?
 ఈరోజు 20 మి. మీ వర్షం కురిసింది అంటే ఆ ప్రాంతంలో ఒక చదరపు మీటర్‌ మీద 20 లీ.. వర్షపు నీరు పడిందని లెక్క. లేదా 40 మిల్లీమీటర్ల వర్షం కురిసింది అంటే ఒక చదరపు మీటర్‌ మీద 40 లీటర్ల వర్షపు నీరు పడిందని లెక్క. 
 1 మి.మీ.వర్షం కురిసింది అంటే 1చ. మీ.మీద 1లీ. వర్షపు నీరు పడింది అని అర్థం. 
Ex:- మీ ఇంటి పై భాగము 100 చ.  మీ. ఉంది. ఒకరోజు 30 మి.మీ.వర్షం పడింది. అంటే 100×30=3000 లీ.. వర్షపు నీరు ఇంటి పై నుండి కిందికి దొర్లి డ్రైనేజీ లో కలిసి, కలుషితమయ్యి వీధులలో పొంగి ఊరంతా కలుషితం చేసిందన్నమాట. 
 ఆ నీటిని పట్టి ఇంటి అవసరాలకు వాడితే అది అమృతం లాంటి నీరు. 
Ex:- 100 చ. మీ. లు  గల మా ఇంటి పై ఒక సంవత్సరం లో కురిసిన వర్షపు నీటి విలువ ఎంత? 
* 100 చ. మీ × 500 మి. మీ = 50, 000 లీ.. ( సంవత్సర సరాసరి)
54, 000  లీ ÷ 3000 ( ఒక ట్యాంకరు నీరు)
=18 ట్యాంకర్లు.   ఒక ట్యాంకర్ నీరు  500 అయినచో.. 
18 × 500 = 9000 రూపాయలు. 

 2030 సంవత్సరం నాటికి భారతదేశంలో 40 % పల్లెల్లో, పట్టణాలలో త్రాగునీరు దొరకదు అని ఇప్పటికే శాస్త్రజ్ఞులు అంటున్నారు... జాగ్రత్త పడండి, వర్షపు నీటిని ఒడిసి పట్టడం నేర్చుకోండి.

భూగర్భజలాల వాడకంలో చైనా, అమెరికాల వాడకాన్ని కలిపినా కూడా మనదే ఎక్కువ. దీనిక్కారణం హరితవిప్లవమే. వరి, చెరకు, గోధుమల్ని ఎక్కువగా పండించడం వల్లే నీటి వినియోగం భారీగా పెరిగిపోయింది. ఇదిలాగే కొనసాగితే బంగారు బాతు గుడ్డు కథ నిజం కావడానికి ఎంతోకాలం పట్టదన్న విషయాన్ని గుర్తించారు తెలంగాణ రైతులు. ఎండిన బోర్లకు ఎలా జీవం పోస్తున్నారో ఈ వీడియో లింక్‌ చూడండి.https://youtu.be/jzvM_p5bf9s















">
....................
https://youtu.be/jzvM_p5bf9s


మరింత సమాచారం తెలుసుకోండి: