సోషల్ మాధ్యమాలలో ఫేస్ బుక్ కి ఉన్నంత క్రేజ్ గతంలో వేరే దేనికి ఉండేది కాదు. ఫేస్ బుక్ ముందు ఏదన్నా సరే దిగదుడుపే. లేచింది మొదలు పడుకునే వరకూ అందరూ ఫేస్ బుక్ కి పరిమితమై పోయేవారు. చీమ చిటుక్కు మన్నా సరే ఫేస్ బుక్ లో పెట్టేయల్సిందే అన్నట్టుగా ఉండేది. ఆ తరువాతి కాలంలో వాట్సప్ ఫేస్ బుక్ కి చెక్ పెట్టింది. వాట్సప్ లో ఉండే వెసులుబాటు, ఫోటోల షేరింగ్, లైవ్ చాట్, వీడియో కాల్స్ ,స్టేటస్ ఇలా ఎన్నో రకాల ఫీచర్స్ తో ఆకట్టుకుంది.

 

క్రమక్రమంగా ఫేస్ బుక్ యూజర్స్ తో చాలా మందిని తనవైపుకు తిప్పుకున్న వాట్సప్ తిరుగులేని సోషల్ మాధ్యమంగా నిలిచింది. అయితే ఇప్పుడు తాజాగా వాట్సప్ మరో సంచలన ఆలోచనతో యూజర్స్ కి మరింత అందుబాటులోకి రానుంది. తన యూజర్స్ డిజిటల్ సేవల కోసం వేరే యాప్స్ వైపుకి మళ్ళకుండా త్వరలో డిజిటల్ చెల్లింపు సేవలని ప్రారంభించనుంది.  అయితే

 

అందుకు తగ్గట్టుగా రిజర్వ్ బ్యాంక్ నిభంధనలని తూచా తప్పకుండా పాటిస్తోంది.పూర్తి స్థాయిలో నిభంధనలకి కట్టుబడి ఉండటంతో పాటు ప్రస్తుతం డేటా ని నిల్వ చేయడం, ప్రాసెసింగ్ సంభందించిన పనులని చెకచెకా  చేస్తోంది. అన్ని అనుకున్నట్టుగా జరిగితే త్వరలో అంటే అక్టోబర్ లేదా డిసెంబర్ సమయానికి డిజిటల్ సేవలని అందుబాటులోకి తీసుకురానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: