ఏ వస్తువు కొనాలన్నా ,ఏ బిల్లు చెల్లించాలన్న సరే దేశవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపు సేవలు అందుబాటులోకి వచ్చాయి. భారత ప్రభుత్వం 2016లో డిమానిటైజేషన్ ప్రకటించిన సమయం మొదలు ఇప్పటివరకు లావాదేవీలన్నీ డిజిటల్ రూపంలో చేయడంతో పని సులభం అవ్వడమే కాకుండా  ఆన్లైన్ మోసగాళ్లకి దోచుకోవడం మరింత సులభం అవుతోంది. దాంతో  సరికొత్త మోసాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్ళు. ఇటీవల జరిగిన ఓ సంఘటన గూగుల్ పే ద్వారా ఆన్లైన్ చెల్లింపులు చేసే వారికి టెన్షన్పె ట్టిస్తోంది.. వివరాల్లోకి వెళితే


గూగుల్ పే ద్వారా కరెంట్ బిల్లు చెల్లించిన ఓ వ్యక్తి ఇ 96 వేల రూపాయలు మోస పోవడం తో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ మోసం ఎలా జరిగిందంటే. పోలీసులు  చెప్పిన కధనం ప్రకారం. ముంబై లో ప్రవైటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ఓ వ్యక్తి  ఆగస్టు 21న గూగుల్ పే ఉపయోగించి తన కరెంట్ బిల్లు చెల్లించాడు. ఈ క్రమంలో జరిగిన లావాదేవీల లోపంతో ఫిర్యాదు కోసమని గూగుల్ పే యొక్క కస్టమర్ కేర్ నెంబర్ కోసం శోధించి ఫిర్యాదు చేశాడు అయితే.

 

ఆన్లైన్లో డిజిటల్ వాలెట్ ప్లాట్ఫాం యొక్క కస్టమర్ కేర్ గా ఓ వ్యక్తి తన సొంత నెంబర్ ని  అప్డేట్ చేసి సైబర్ మోసాలకు పాల్పడుతున్న నెంబర్ గా  ఆ నెంబర్ ని కస్టమర్ గుర్తించలేకపోయాడు. దాంతో ఆ నెంబర్ కి కాల్ చేసి కస్టమర్ వివరాలు అన్నీ చెప్పడంతో, గూగుల్ పే అధికారిగా నటించిన ఆ మోసగాడు ఫిర్యాదు దారుడికి కలెక్ట్ రిక్వెస్ట్ పంపించి దానిపై క్లిక్ చేయమని కోరాడు.అయితే అతడు  మోసగాడు అని తెలియక ఫిర్యాదు దారుడు లింక్ పై  క్లిక్ చేయడం తో అతని ఖాతా నుంచి 96 వేల రూపాయలు బదిలీ అయిపోయాయి అనంతరం మోసపోయిన అని తెలుసుకున్న అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ జరిపిన పోలీసులు డిజిటల్ చెల్లింపులు చేసే సమయంలో ఎంతో జాగ్రత్త వహించాలని హెచ్చరించి కేసు నమోదు చేసుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: