వన్‌ప్లస్ .. ఐఫోన్ తర్వాత ట్రేండింగ్ ఫోన్ వన్ ప్లస్. ఈ ఫోన్ కొత్త వాటికోసం తెగ ఎదురు చూస్తుంటారు వన్ ప్లస్ ప్రేమికులు. చైనాకు చెందిన ఈ కంపెనీ నుండి ఇటీవలే వన్‌ప్లస్ 7టి ప్రొ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఫోన్ కు సంబంధించి మెక్‌లారెన్ ఎడిషన్‌ను ఆ కంపెనీ ప్రస్తుతం విడుదల చేసింది. 


ఈ వేరియెంట్ ధర రూ.58,999 ఉండగా ఈ ఫోన్ నవంబర్ 5వ తేదీ నుంచి విక్రయించనున్నారు. వన్‌ప్లస్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్లలో ఇప్పటికే ఈ ఫోన్‌కు ప్రీ ఆర్డర్లను ప్రారంభమయ్యాయి. ఫోన్ వినియోగదారులు కేవలం రూ.5వేలు చెల్లించి ఈ ఫోన్‌ను ప్రీ ఆర్డర్ చేసుకోవచ్చు. అయితే ఈ ఫోన్ ఇక్కడ ఒకసారి చదివి తెలుసుకోండి. 


వన్‌ప్లస్ 7టి ప్రొ మెక్‌లారెన్ ఎడిషన్ ఫీచర్స్ ఇవే.. 


6.67 ఇంచుల క్వాడ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే


గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్


ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 855 ప్లస్ ప్రాసెసర్


12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ 


ఆండ్రాయిడ్ 10, డ్యుయల్ సిమ్


48, 8, 16 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు


16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా


ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్


యూఎస్‌బీ టైప్ సి


డాల్బీ అట్మోస్ 


డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ


బ్లూటూత్ 5.0


4080 ఎంఏహెచ్ బ్యాటరీతో పాటు ఫాస్ట్ చార్జింగ్ అందుబాటులో ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: