ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్థ వివో ఈ సంవత్సరంలో చాలా మొబైల్స్ ను విడుదల చేసింది. ప్రస్తుతం తాజాగా వివో వై19 మార్కెట్ లోకి వచ్చేసింది. థాయిలాండ్‌లో విడుదలైన ఈ ఫోన్ చూడడానికి వివో యూ3కి రీబ్రాండెడ్ వెర్షన్‌లగా కనిపిస్తోంది. అయితే వివో వై19 స్మార్ట్ ఫోన్ అతిపెద్ద బ్యాటరీ, హెలియో ప్రాసెసర్, ట్రిపుల్ రియర్ కెమెరా వంటి ఆకర్షణలతో మనముందుకు వచ్చింది. 


యూ3’లో ఉపయోగించినట్టు స్నాప్‌ డ్రాగన్ 675 ప్రాసెసర్ కాకుండా ఇందులో మీడియా టెక్ హెలియో పి65 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. అయితే అందులో ఎం ఉన్నాయో అవి అన్ని సేమ్ టు సేమ్ ఉన్నాయి. వాటర్ డ్రాప్ స్టైల్ నాచ్, రియర్ ఫింగర్‌ ప్రింట్ స్కానర్ ఇందులో ఉన్నాయి. వివో వై19 ధర భారత్‌లో రూ.16,400 వరకు ఉండే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. అయితే ఈ ఫోన్ ధర ఎంత ఉంటుంది? ఇందులో ఏం స్పెషల్ ఫీచర్లు ఉన్నాయో ఒకసారి ఇక్కడ చుడండి. 


వివో వై19 ప్రత్యేకతలు.. 


6.53 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 


ఆండ్రాయిడ్ 9పై ఓఎస్, 


6 జీబీ ర్యామ్, 


64 జీబీ ఇంటర్నల్ మెమొరీ, 


16 ఎంపీ+8 ఎంపీ+ 2 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా, 


16 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 


5,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలు ఈ ఫోన్ లో ఉన్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: