వినియోగదారులను ఆకట్టుకోడానికి వ్యాపారులు ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. మొన్నటి వరుకు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లో అదిరిపోయిన ఆఫర్లు ఇప్పుడు నోకియా స్మార్ట్ ఫోన్ కూడా ఇస్తుంది. ఇంకా విషయానికి వస్తే.. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ నోకియా తన మరో స్మార్ట్ ఫోన్ ధరను భారీగా తగ్గించింది. ఎంత తగ్గించింది ? ఏ ఫోన్ తగ్గించింది అని అనుకుంటున్నారా ? 


రూ.20,499 విలువైన నోకియా 6.1 ప్లస్ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం రూ.9,999కే అమెజాన్‌లో లభిస్తోంది. ఈ ఫోన్ గత సంవత్సరం సెప్టెంబర్‌లో మార్కెట్లోకి రాగా అతి తక్కువ ధరకు లభించడం మాత్రమే కాకుండా ఈ ఫోన్ కొనుగోలుపై వివిధ బ్యాంకులు ఆఫర్లను ప్రకటించాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ డెబిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.500 వరకు తగ్గింపు లభిస్తుంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్లు ఏంటో ఒకసారి చూడండి. 


నోకియా 6.1 ప్లస్ ఫీచర్లు


5.8 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్‌ప్లే,


యాస్పెక్ట్ రేషియో 19:9,


స్క్రీన్ రిజల్యూషన్ 2280×1080 పిక్సెల్స్,


6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్,


క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 636 ఆక్టాకోర్ ప్రాసెసర్,


16+5 మెగా పిక్సెల్ డ్యూయెల్ రియర్ కెమెరా,


16 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా,


బ్యాటరీ 3060 ఎంఏహెచ్,


హైబ్రిడ్ సిమ్ స్లాట్,


ఫింగర్ ప్రింట్ ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం.. అద్భుతమైన స్మార్ట్ ఫోన్ అతి తక్కువ ధరతో ఈ స్మార్ట్ ఫోన్ ని అమెజాన్ లో కొనుగోలు చెయ్యండి. 


మరింత సమాచారం తెలుసుకోండి: