వాట్సప్ ఈ పేరు ఇప్పుడు ప్రపంచాన్ని ఊపేస్తోంది. దాదాపు ప్రతి ఒక్క స్మార్ట్ ఫోన్లో ఈ సామాజిక మాధ్యమం కనిపిస్తోంది. సోషల్ మీడియాలో దూసుకుపోతున్న ఇన్ స్ట్ంట్ మెసేజింగ్ దిగ్గజం వాట్సప్.. యూజర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. వాట్సప్‌లో మీరు పంపిన మెసేజ్ డిలిట్ చేయాలంటే మీరు ఆ మెసేజ్‌ని సెలెక్ట్ చేసి డిలిట్ ఆప్షన్ క్లిక్ చేస్తారు కదా? ఇకపై ఈ అవసరం రాదు. మీరు పంపిన మెసేజ్ మీరు కోరుకున్న సమయంలో మాయమైపోతుంది. అదేంటి అనుకుంటున్నారా..? అదే వాట్సప్‌లో వచ్చిన సరికొత్త ఫీచర్.

 

మొదట్లో 'డిసప్పీయరింగ్ మెసేజెస్' పేరుతో ఈ ఫీచర్‌ని రూపొందించింది వాట్సప్. ఆ తర్వాత పేరును 'డిలిట్ మెసేజెస్' అని మార్చింది. అంటే మెసేజ్‌ని డిలిట్ చేయడం అన్నమాట. ప్రస్తుతం అయితే మీరు మెసేజ్ పంపిన తర్వాత కొంత సమయం వరకు డిలిట్ చేయొచ్చు. మీరు ప్రత్యేకంగా ఛాట్ ఓపెన్ చేసి మెసేజ్ డిలిట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు టైమ్ సెట్ చేస్తే చాలు. సరిగ్గా ఆ సమయానికి మెసేజ్ డిలిట్ అవుతుంది. ఉదాహరణకు మీరు ఒక‌ గంట, ఒక‌ రోజు, ఒక వారం, ఒక‌ నెల, ఒక‌ ఏడాది ఇలా సమయాన్ని మీరే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. 

 

అంటే మీరు ఒక రోజు అని సెలెక్ట్ చేస్తే మీరు పంపిన మెసేజ్ సరిగ్గా ఒక రోజులో డిలిట్ అవుతుంది. అవతలివాళ్లు చదివినా కూడా ఆ సమయానికి మెసేజ్ డిలిట్ అయిపోతుంది. ఇక ప్రస్తుతం ఈ ఫీచర్ అప్‌డేట్ బీటా యూజర్లకు లభిస్తోంది. బీటా టెస్టింగ్ పూర్తైన తర్వాత మిగతా యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: