వాట్సప్ ఈ పేరు ఇప్పుడు ప్రపంచాన్ని ఊపేస్తోంది. దాదాపు ప్రతి ఒక్క స్మార్ట్ ఫోన్లో వాట్సాప్ కనిపిస్తోంది. ఏం ఉపయోగించినా.. ఉపయోగించకపోయినా.. వాట్సాప్‌ను మాత్రం డిలీట్ చేయకూడదు అనేంతగా జనం ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే దీంట్లో చాటింగ్ చేయడం, ఫోటోలు, వీడియోలు, ఫైల్స్ పంపడం చాలా సులభం. మరోవైపు సోషల్ మీడియాలో దూసుకుపోతున్న ఇన్ స్ట్ంట్ మెసేజింగ్ దిగ్గజం వాట్సప్.. యూజర్లను ఆకట్టుకునేలా ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. అయితే ఇప్పుడు ఈ క్రేజ్ ని క్యాష్ రూపంలో సొంతం చేసుకునేందుకు కొందరు మాయగాళ్లు రెడీ అవుతున్నారు.
అయితే మొబైల్ ఫోన్‌లోని వాట్సాప్ గ్రూపులను టార్గెట్ చేసే బగ్‌ను తాము గుర్తించినట్లు వాట్సాప్ వెల్లడించింది. బగ్ కారణంగా గ్రూపుల్లోని మెసేజులు శాశ్వతంగా డిలీట్ అవుతున్నాయని తెలిపారు. హ్యాకర్లు వాట్సాప్ వెబ్‌ను ఉపయోగించి వెబ్ డీబగ్గింగ్ టూల్ ద్వారా గ్రూపుల్లో ప్రత్యేక పారామీటర్లు ఉన్న సందేశాలు పంపుతున్నారని తెలిపారు. దీనివల్ల గ్రూప్ క్రాష్ అయ్యి పనిచేయడం ఆగిపోతోందని వాట్సాప్ ప్రొడక్ట్ వల్నెరబిలిటీ రీసెర్చ్ చెక్ పాయింట్స్ హెడ్ ఓడెడ్ వనును తెలిపారు.
దీని బారిన పడకుండా ఉండేందుకు తాజా వెర్షన్ 2.19.58కు అప్‌డేట్ చేసుకోవాలని మంగళవారం సూచించింది. అలాగే ఈ హ్యాకింగ్ ప్రక్రియను సాగించే హ్యాకర్లు ఆయా గ్రూపుల్లో సభ్యులై ఉంటారని చెప్పారు. ఈ బగ్‌కు ప్రత్యామ్నాయ మార్గం లేకపోవడంతో వినియోగదారులు వాట్సాప్ అన్‌ఇన్‌స్టాల్ చేసి మళ్లీ ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి వస్తోందన్నారు. సో.. బీ కేర్‌ఫుల్..!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి