ప్రతి ఒక్కరి చేతులో ఇంటర్నెట్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్, అందులో వాట్సాప్ అప్లికేషన్ పరిపాటిగా మారిపోయింది. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రస్తుత యువతరం వాట్సాప్ మత్తులో మునిగితేలుతోంది. వాస్త‌వానికి సోషల్ మీడియా యాప్ లో ది బెస్ట్ యాప్ గా చెప్పుకునే వాటిల్లో వాట్సాప్ ఒకటి.  ఈ యాప్ డెవలప్ అనేక మార్పులు చేసుకున్నది.  మెసేజ్ ల నుంచి ఫోటో షేరింగ్, వీడియో షేరింగ్ వంటి కొత్త కొత్త మార్పులను తీసుకొచ్చి యూజ‌ర్ల‌ను ఆక‌ట్టుకుంటోంది. ఐఫోన్, ఆండ్రాయిడ్, బ్లాక్‌బెర్రీ, విండోస్ ఇలా అన్ని మొబైల్ ప్లాట్‌ఫామ్‌లను వాట్సాప్ సపోర్ట్ చేస్తుంది. 

 

వాట్సాప్ ఇంతలా క్రేజ్ సంపాదించటానికి చాలా కారణాలే ఉన్నాయి. ప్రధాన కారణం ఈ ప్రముఖ ఇన్‌స్టెంట్ మెసెంజర్ యాప్ నిరంతరం సరికొత్త అప్‌డేట్‌లను లాంచ్ చేస్తూనే ఉంటుంది. ఇదిలా ఉంటే.. సైబర్‌ నేరగాళ్లు రోజుకో కొత్త పంథాలో మోసాలకు పాల్పడుతున్నారు. ఇప్పుడు వీళ్లు వాట్పాప్‌ను మార్గంగా ఎంచుకుంటున్నారు. డబ్బులు పంపించాలని క్యూఆర్‌ కోడ్‌లను కూడా ఇమేజ్‌ల రూపంలో దుండగులు వాట్సాప్‌లో పంపుతున్నారు. వాటిని స్కాన్‌ చేస్తే డబ్బులు వస్తాయని ఆశ పెడుతున్నారు. దీంతో వాటిని నమ్మి ఆ క్యూఆర్‌ కోడ్‌లను యూజర్లు స్కాన్‌ చేస్తున్నారు. 

 

ఆ తరువాత వారి అకౌంట్లలో నుంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్‌ అవుతున్నాయి. అలాగే వాట్సాప్‌లలో యూజర్లకు మెసేజ్‌లను పంపిస్తూ వాటి ద్వారా డబ్బులు కాజేస్తున్నారు. సైబర్‌ నేరగాళ్లు వాట్సాప్‌లో యూజర్లకు మనీ రిక్వెస్ట్‌లను పంపిస్తున్నారు. వాటిని ఓపెన్‌ చేసి యూపీఐ పిన్‌ ఎంటర్‌ చేస్తే చాలు.. క్షణాల్లో బాధితుల బ్యాంక్‌ అకౌంట్లలో ఉండే డబ్బు అవతలి వారికి ట్రాన్స్‌ఫర్‌ అవుతోంది.  ఇలా అనేక ర‌కాలుగా సైబర్‌ నేరగాళ్లు ప్ర‌జ‌ల‌ను దోచుకుంటున్నారు. అందుకే  అపరిచితుల నుంచి వచ్చే ఏ మెసేజ్‌ను అయినా సరే ఓపెన్‌ చేయకూడదని ఐటీ సెక్యూరిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారుసో.. బీ కేర్‌ఫుల్‌.
 

మరింత సమాచారం తెలుసుకోండి: