కొత్త స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేయడంలో ఒప్పో ఎంతో వేగంగా ముందుకు దూసుకువెళుతోంది.  ఫ్లాగ్ షిప్ విభాగంలో ఒప్పో రెనో 2 సిరీస్ ఫోన్లను లాంచ్ చేసి రెండు నెలలు కూడా కాకముందే ఇప్పుడు రెనో 3ని లాంచ్ చేసింది. ఈ నేప‌థ్యంలోనే చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీ ఒప్పో రెండు కొత్త 5g స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసింది. కొత్తగా రెనో 3 సిరీస్ లో భాగంగా ఒప్పో రెనో 3, ఒప్పో రెనో 3 ప్రో అనే రెండు కొత్త ఫోన్‌లను లాంచ్ చేసింది. ఒప్పో రెనో 3 మరియు ఒప్పో రెనో 3 ప్రో డ్యూయల్-మోడ్ 5జి సపోర్ట్, క్వాడ్ రియర్ కెమెరా దీని ప్రత్యేకత. ఒప్పో రెనో 3 స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 1000 ఎల్ 5జి ఎస్‌ఓ‌సి టెక్నాలజితో వస్తున్న మొదటి ఫోన్, ఒప్పో రెనో 3ప్రో స్నాప్‌డ్రాగన్ 765 జి ఎస్‌ఓ‌సి టెక్నాలజితో వస్తుంది.

 

ఫీచర్ల విష‌యానికి వ‌స్తే.. ఒప్పో రెనో 3 స్మార్ట్ ఫోన్ లో 6.4 అంగుళాల TUV రెయిన్ లాండ్ డిస్ ప్లేను అందించారు. వెనకవైపు నాలుగు కెమెరాల సెటప్ ను అందించారు. ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగా పిక్సెల్ కాగా.. 8 మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్ కూడా ఇందులో ఉంది. సెల్ఫీ ప్రియుల కోసం 32 మెగా పిక్సెల్ కెమెరా ముందువైపు అందుబాటులో ఉంది. ఇందులో ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను అందించారు. 4,025 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా ఇందులో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 

 

8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను 3,399 యువాన్లుగా(సుమారు రూ.34,000) నిర్ణయించారు. హైఎండ్ వేరియంట్ అయిన 12 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను 3,699 యువాన్లుగా(సుమారు రూ.37,000) నిర్ణయించారు. రెండు ఈ స్మార్ట్ ఫోన్ మిస్టీ వైట్, మూన్ నైట్ బ్లాక్, సన్ రైజ్ ఇంప్రెషన్, బ్లూ స్టారీ నైట్ రంగుల్లో లభించనుంది. అలాగే ఒప్పో రెన్ 3 ప్రోలో 6.5 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ అమోఎల్ఈడీ(AMOLED) డిస్ ప్లేను అందించారు. ఇందులో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగా పిక్సెల్ కాగా, 8 మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్, 13 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న టెలిఫొటో లెన్స్, 2 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న మోనోక్రోమ్ సెన్సార్ ను అందించారు. సెల్ఫీ ప్రియుల కోసం 32 మెగా పిక్సెల్ కెమెరాను ముందువైపు అందించారు. 

 

స్మార్ట్ ఫోన్ లో 4,025 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. రెన్ 3 ప్రోలో కూడా రెండు వేరియంట్ల‌లో అందుబాటులో ఉంది. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను 3,999 యువాన్లుగా(సుమారు రూ.40,000) నిర్ణయించారు. 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను 4,499 యువాన్లుగా(సుమారు రూ.45,000) నిర్ణయించారు. ఈ స్మార్ట్ ఫోన్ కూడా మిస్టీ వైట్, మూన్ నైట్ బ్లాక్, సన్ రైజ్ ఇంప్రెషన్, బ్లూ స్టారీ నైట్ రంగుల్లోనే అందుబాటులో ఉండనుంది. ఇక ఈ ఫోన్ల‌కు సంబంధించిన సేల్ కూడా చైనాలో డిసెంబర్ 31 నుంచే ప్రారంభం కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: