టిక్‌టాక్... యువతకు పెద్దగా పరిచయం అక్కర్లేని వీడియో క్రియేటింగ్, షేరింగ్ యాప్. ఒకవైపు ఆన్‌లైన్ గేమ్స్ పబ్‌జి లాంటివి యువతను మాయలో పడేస్తుంటే… టిక్‌టాక్ లాంటి యాప్‌లు చిన్నాపెద్దలకు క్రేజీగా తయారయ్యాయి. ఇంతగా అందరినీ మోజులో ముంచెత్తుతున్న ఈ యాప్‌ని చైనా కంపెనీ తయారు చేసింది. అంతకుముందు 2014లో వచ్చిన డబ్స్‌స్మాష్ యాప్ ద్వారా సినిమాల్లోని డైలాగ్స్‌లను ఇమిటేట్ చేస్తూ నటిస్తారు. దీన్ని డామినేట్ చేస్తూ టిక్‌టాక్ వచ్చింది. యువతీయువకుల్లో టిక్‌టాక్ వీడియోలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. 

 

టిక్‌టాక్ యాప్‌లో క్రియేటీవ్‌గా వీడియోలు రూపొందించడం, వాటిని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో షేర్ చేయడం, లైకులు, షేర్లు, కామెంట్లు సంపాదించడం మామూలే. టిక్‌టాక్‌ హవా కొనసాగుతూనే వుంది. వీడియో క్రియేటింగ్ యాప్స్‌లోనే కాదు... మొత్తం సోషల్ మీడియా యాప్స్‌‌లో సైతం టిక్‌టాక్‌దే హవా. వివిధ సంస్థల నుంచి విమర్శలు, ఆరోపణలు వస్తున్నా, వివాదాలు చుట్టుముడుతున్నా టిక్‌టాక్ యాప్‌కు క్రేజ్ మాత్రం తగ్గట్లేదు. గతేడాది ప్రపంచ వ్యాప్తంగా 700 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్స్‌ను సొంతం చేసుకున్న టిక్‌టాక్‌ యాప్‌ మన దేశంలోనూ దూసుకుపోతోంది. 

 

2018లో డౌన్‌లోడ్స్‌ పరంగా టిక్‌టాక్‌ యాప్‌ నాలుగో స్థానంలో వుంటే, రెండు, మూడు స్థానాల్లో ఫేస్‌బుక్‌ మెసెంజర్‌, ఫేస్‌బుక్‌ యాప్‌ రెండు, మూడు స్థానాల్లో వుండేవి. అయితే ఇప్పుడు టిక్‌టాక్ వీటిని దాటుకొని, ఇప్పుడు రెండో స్థానంలో నిలిచింది. దీనికి కారణం ప్రధానంగా ఇండియానే అని సెన్సార్‌ టవర్‌ చెబుతోంది. ఎందుకంటే ఆ యాప్‌ను తొలిసారి డౌన్‌లోడ్‌ చేసుకున్నవారిలో 45 శాతం భారతీయులేనట. అయితే, ఈ డౌన్‌లోడ్స్‌ రేటింగ్‌లో 850 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్స్‌తో వాట్సాప్‌ ప్రథమ స్థానంలో ఉంది. టిక్‌టాక్‌ రెండో స్థానంలో, ఫేస్‌బుక్‌ మెసేంజర్‌ మూడో స్థానంలో, ఫేస్‌బుక్‌ 4వ స్థానంలో, ఇన్‌స్టాగ్రామ్‌ 5వ స్థానంలో నిలిచాయి

 

మరింత సమాచారం తెలుసుకోండి: