సాధారణంగా యాపిల్ ఫోన్లంటే కేవలం ధనవంతులకు మాత్రమే అనే అభిప్రాయం అందరిలో ఉంటుంది. అయితే ఆ అభిప్రాయాన్ని అబద్ధం చేస్తూ తక్కువ ధరలో ఐఫోన్ లాంచ్ కానుంది. ఐఫోన్లపై వినియోగదారుల క్రేజ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు ఆపిల్‌ కంపెనీ సన్నద్ధమవుతోంది.  బడ్జెట్‌ ధరలో ఐఫోన్‌. అసలు ఈ మాటే వినియోగదారులకు వీనుల విందైన మాటల మూట.  ఈ ఏడాది మార్చి నాటికి ఈ ఫోన్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానుంది. ఈ నేపథ్యంలో వచ్చేనెల ఫిబ్రవరి నుంచి ఈ కొత్త ఐఫోన్‌ విడిభాగాల అసెంబ్లింగ్‌ను ప్రారంభించనుంది.

యాపిల్ సంస్థకి చెందిన ఐఫోన్ మోడల్స్ లో కేవలం ఎస్ఈ మాత్రమే ధర తక్కువ అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే.. దీనిని భారత్ లోనే తయారు చేస్తారు. కాగా.. దీని కొనసాగింపుగా.. మరో మోడల్ ని ప్రవేశపెడుతున్నారు. ఐఫోన్ ఎస్‌ఈ తరువాత అతి తక్కువ ధరలో రానున్న మొదటి ఐఫోన్ మోడల్ ఇది కానుండటం విశేషం.  4.7అంగుళాల స్క్రీన్‌తో 2017లో వచ్చిన ఐఫోన్ 8 మాదిరిగానే ఉండనుందట. అలాగే ఆండ్రాయిడ్‌ ఫోన్ల మాదిరిగానే  ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ను అమర్చనుంది.

2020లో మరిన్ని కొత్త ఫీచర్లు, 5 జీ కనెక్టివిటి, పాస్టర్‌ ప్రొసెసర్‌, 3డి బ్యాక్‌ కెమెరా లాంటి ఫీచర్లతో హైఎండ్‌ ఐ ఫోన్‌లను అందుబాటులోకి తేవాలని యోచిస్తోంది.  అలాగే 2020 లో 200 మిలియన్ యూనిట్లకు పైగా రవాణా చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది ఆపిల్‌. అలాగే  హ్యాండ్‌సెట్‌ అసెంబ్లింగ్‌ను హాన్‌హయ్‌ ప్రీసీషన్‌ ఇండస్ట్రీ, పెగట్రాన్‌ కార్పోరేషన్‌, విస్ట్రన్‌ కార్పొరేషన్‌లకు అప్పగించింది. తద్వారా అటు వినియోగదారులకు ఆకట్టుకోవడంతోపాటు, భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో తన స్థానాన్ని  మరింత విస్తరించుకోవాలని ఆపిల్‌ భావిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: