ఇటీవ‌ల కాలంలో స్మార్ట్‌ఫోన్ల వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. ఇక స్మార్ట్ ఫోన్ ఉన్న వాళ్లంద‌రికీ వాట్సాప్ ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. ఇన్‌స్టెంట్ మెసేజింగ్ ప్రపంచంలోకి పెను ఉప్పెనలా దూసుకొచ్చిన వాట్సాప్‌ను రకరకాల కమ్యూనికేషన్ అవసరాల దృష్ట్యా ప్రతిరోజు కోట్ల‌లో యూజర్లు వినియోగించుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రతి ఒక్కరూ రోజు వారీ అవసరాలకు, ఆఫీస్ ల్లో కమ్యూనికేషన్ కోసం ఇలా వివిధ రకాలుగా వాట్సాప్‌ను ఉపయోగిస్తున్నారు.  

 

 చాలా సులభంగా దీన్ని వాడే సదుపాయం ఉండటం వల్ల ఎక్కువ మంది దీన్ని వినియోగించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. మ‌రో వైపు వాట్సాప్ కూడా యూజ‌ర్ల‌ను ఆక‌ట్టుకునే విధంగా ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త కొత్త ఫీచ‌ర్ల‌తో ముందుకు వ‌స్తోంది. ఈ క్ర‌మంలోనే నిత్యం అప్‌డేట్ అవుతూ మరింత యూజర్ ఫ్రెండ్లీగా మారుతోంది. ఇందులో భాగంగానే ఇటీవల డార్క్‌మోడ్‌ని తీసుకొచ్చింది వాట్సాప్. ఇప్పటికే ఆండ్రాయిడ్ బీటా యూజర్లకు వాట్సప్ డార్క్ మోడ్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. 

 

2.20.13 అప్‌డేట్ చేసిన వాట్సప్ అప్లికేషన్‌లో ఈ డార్క్‌ మోడ్ ఆప్షన్ కనిపిస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా.. ఎప్పుడెప్పుడు డార్క్ మోడ్ ఫీచర్ వస్తుందా అని వెయిట్ చేసిన‌ ఐఫోన్ యూజ‌ర్ల‌కు గుడ్‌న్యూస్ చెప్పింది వాట్సాప్. డార్క్‌మోడ్‌తో ఐఓఎస్‌ బీటా వర్షన్‌ను వాట్సాప్ అప్‌డేట్ చేస్తున్నట్లు తెలిసింది. ఐవోఎస్ బీటా వర్షన్‌ను 2.20.20కి అప్‌డేట్ చేస్తే ఈ ఫీచర్ లభిస్తుందని మొదట WABetaInfo వెల్లడించింది. ఇక త్వరలోనే బీటా యూజర్లందరికీ అందుబాటులోకి వస్తుందని కూడా తెలిపింది. సో.. ఐఫోన్ యూజ‌ర్స్ లేట్ చేయ‌కుండా ఈ ఫీచ‌ర్‌ను మీరు వినియోగించుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: