మొబైల్ మార్కెట్‌లో మధ్యతరగతి ప్రజలకు అతి దగ్గరగా ఉన్న చైనా మొబైల్​ ఫోన్ల తయారీ దిగ్గజం షియోమీ. షియోమీ కంపెనీ తమ కొత్త స్మార్ట్ ఫోన్లను ఇండియా మొబైల్ మార్కెట్లలో రిలీజ్ చేసిన కొద్దికాలంలోనే ఎంతో పాపులర్ అయ్యాయి. మిగతా స్మార్ట్ ఫోన్లకంటే షియోమీ స్మార్ట్ ఫోన్లు ఫుల్ క్రేజ్ కొట్టేశాయి. దీంతో చాలా మంది షియోమి ఫోన్ల‌నే కొన‌డానికి ఇష్ట‌ప‌డుతున్నారు. అయితే షియోమీ ప్రియుల‌కు ఓ బ్యాడ్ న్యూస్‌. చైనాపై తీవ్రప్రభావం చూపిస్తున్న కరోనావైరస్ ప్రభావం షియోమీపై కూడా పడింది. ఈ సంస్థ తమ స్మార్ట్ ఫోన్ రెడ్ మీ నోట్ 8 ధరను మనదేశంలో రూ.500 పెంచింది. 

 

కరోనా వైరస్ ప్రభావంతో సప్లై చైన్ దెబ్బతినడమే దీనికి కారణం. అయితే ఈ పెంపు తాత్కాలికమేనని షియోమీ తెలిపింది. అది కూడా ఈ ధర పెంపు కూడా రెడ్‌మీ నోట్ 8 4 జీబీ + 64 జీబీ మోడల్‌కు మాత్రమే వర్తిస్తుంది. ఇంతకు ముందు ఈ ఫోన్‌ ధర రూ. 9,999గా ఉంది. ఇప్పుడు ధర పెరుగుదల అనంతరం దీని ధర రూ.10.499గా ఉంది. అలాగే ఎంఐ.కామ్, అమెజాన్ ల్లో ధరల పెరుగుదల ఇప్పుడే కనిపిస్తుంది. 

 

ఇక ఈ ఫోన్ విషయానికి వస్తే... ఈ మోడల్ ఫోన్లు 6.39 అంగుళాల ఫుల్ టచ్ స్క్రీన్ తో మార్కెట్లోకి వ‌చ్చింది. దీని ప్రాసెసర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 665 కాగా, 4 జీబీ ర్యామ్ నుంచి వేరియెంట్లు ఉన్నాయి. ఇందులో 4,000 ఎంఏహెచ్ సామర్థ్యమున్న బ్యాటరీ ఉంటుంది. 48+8+2+2 మెగా పిక్సెల్ కెమెరాలు ఇందులో వెనకవైపు ఉన్నాయి. అంటే కేవలం వెనకవైపు మాత్రమే 4 కెమెరాలు ఉన్నట్లు అన్నమాట. సెల్ఫీ కెమెరా సామర్థ్యం 13 మెగా పిక్సెల్ గా ఉంటుంది. ఇక ఏదేమైనా ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొంతకాలం వెయిట్ చేసి కొనుగోలు చేయ‌డం ఉత్తమం

 

మరింత సమాచారం తెలుసుకోండి: