వాట్సాప్‌.. ప్రత్యేకంగా ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. ముఖ్యంగా ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరి ఫోన్లలో కచ్చితంగా ఉండే యాప్ వాట్సాప్. ఫేస్‌బుక్‌కు చెందిన ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్ వినియోగం విపరీతంగా విస్తరిస్తోంది. ఈ ఇన్ స్టెంట్ మెసేజింగ్ యాప్ రాకతో సోషల్ నెట్ వర్కింగ్ మరింత వేగాన్ని పుంజుకుంది. ఇక వాట్సాప్ కూడా యూజ‌ర్ల‌ను ఆక‌ర్షించేందుకు కొత్త కొత్త ఫీచ‌ర్ల‌ను అందుబాటులోకి తెస్తుంటుంది. 

 

తాజాగా కూడా వాట్సాప్ లో మరో ఆసక్తికర ఫీచర్ వచ్చి చేరనుంది. ఈమధ్య డార్క్ మోడ్ ను ప్రవేశపెట్టిన వాట్సాప్, త్వరలోనే సెల్ఫ్ డిస్ట్రక్షన్ మెసేజ్ సదుపాయాన్ని కస్టమర్లకు అందించనుంది. సాధార‌ణంగా మనం వాట్సాప్ లో అవతలి వారికి పంపిన మెసేజ్ డిలీట్ చేయాలంటే డిలీట్ ఫ‌ర్ ఎవ్రీ వ‌న్‌ ఆప్షన్ ను ఉపయోగిస్తాం. అయితే దీన్ని ఉపయోగించి మనం మెసేజ్ డిలీట్ చేస్తే అక్కడ యు డిలీటెడ్ థీస్ మెసేజ్ అనే మెసేజ్ కనిపిస్తూ ఉంటుంది. అయితే వాట్సాప్ కొత్తగా తీసుకురానున్న ఫీచర్ ద్వారా మనం పంపిన మెసేజెస్ వాటంతట అవే డిలీట్ అవుతాయి.

 

అంతేకాకుండా ఆ మెసేజ్ కు సంబంధించి యు డిలీటెడ్ థీస్ మెసేజ్‌ అనే అలెర్ట్ కూడా కనిపించదు. మ‌రియు  నిర్ణీతకాలంగా, ఓ గంటో, ఓ రోజో, వారమో, నెలో ముందుగానే ఎంచుకుంటే, ఆ మెసేజ్ లు సమయం ముగిసిన తరువాత డిలీట్ అవుతాయి. ఇక ఈ ఫీచర్ ను ప్రస్తుతం ఆండ్రాయిడ్ బీటా యూజర్లకు వాట్సాప్ అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే ఈ ఫీచర్ మిగతా వినియోగదారులకు ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే విషయంపై స్ప‌ష్ట‌త లేదు. కానీ, అతి త్వ‌ర‌లోనే వ‌స్తుంద‌ని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: