వాట్సాప్‌.. ప్ర‌త్యేకంగా ప‌రిచ‌డం అవ‌స‌రం లేని పేరు. మెసేజింగ్, వాయిస్, వీడియో కాల్స్ చేసుకోవడానికి కోట్లాది మంది వాట్సాప్ ను వినియోగిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఫోన్ లోను ఈ యాప్ తప్పనిసరిగా ఉంటోంది.  సోషల్ మీడియా నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకుంటూ ఓ రేంజ్‌లో ఈ యాప్ దూసుకుపోతోంది. దీంతో వాట్సాప్ లేనిదే ఇప్పుడు మనం లేము అనే స్థాయికి వచ్చేశాం. ఇక ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతూ యూజర్లను ఆకర్షిస్తున్న మెసేజింగ్ యాప్ వాట్సాప్ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తేనుంది. 

 

అదే ఫార్వార్డెడ్ మెసేజెస్ సెర్చ్ ఫీచ‌ర్‌. సాధార‌ణంగా వాట్సాప్ లో ఎలాంటి మెసేజ్ అయినా షేర్ చేసే అవకాశం ఉన్నది. దీంతో నూటికి 70 శాతం ఫేక్ మెసేజ్ లు షేర్ అవుతుంటాయి. వాటి వలన కొన్నిసార్లు ఇబ్బందులు తలెత్తుతుంటాయి. మ‌రియు ప్రాణాలు కోల్పోతున్న సంద‌ర్భాలు ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే ఏది నమ్మాలో.. ఏది అబద్ధమో కూడా అర్థం కాని స్థితి కొందరిది. అయితే ఈ స‌మ‌స్య‌కు చెక్ పెడుతూ వాట్సాప్ ఫార్వార్డెడ్ మెసేజెస్ సెర్చ్ ఫీచ‌ర్ అందుబాటులోకి తేనుంది. 

 

ఈ ఫీచ‌ర్ స‌హాయంతో యూజ‌ర్లు త‌మ‌కు వాట్సాప్‌లో ఫార్వార్డ్ అయ్యే మెసేజ్‌ల‌లో ఉండే టెక్ట్స్‌ను గూగుల్ లో వెద‌క‌వ‌చ్చు. దీంతో ఆ మెసేజ్‌ల‌లో ఉండే వార్త నిజ‌మేనా, న‌కిలీనా అనేది సుల‌భంగా తెలుస్తుంది. ఈ క్ర‌మంలో ఫేక్ న్యూస్‌కు అడ్డుక‌ట్ట వేసేందుకు అవ‌కాశం ఉంటుంది. అయితే ప్ర‌స్తుతం ఈ ఫీచ‌ర్‌ను వాట్సాప్ ప్ర‌స్తుతం ప్ర‌యోగాత్మ‌కంగా ప‌రిశీలిస్తోంది. త్వ‌ర‌లోనే దీన్ని యూజ‌ర్ల‌కు అందుబాటులోకి తేనున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: