వాట్సాప్‌.. నేటి కాలంలో స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్ర‌తి ఒక్క‌రూ దీన్ని ఉప‌యోగిస్తున్నారు. అల‌స స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసిన త‌ర్వాత చాలా మంది మొద‌ట వాట్సాప్‌నే డౌన్‌లోడ్ చేస్తార‌ట‌. చాటింగ్ చేయ‌డానికి, వీడియో కాల్స్ చేయ‌డానికి‌, వాయి‌స్ మెసేజ‌స్ ఇలా ఎన్నో ర‌కాలుగా వాట్సాప్‌ను వినియోగిస్తుంటాం. ఇక వాట్సాప్ సైతం ఎప్ప‌టిక‌ప్పు కొత్త ఫీచ‌ర్ల‌ను తీసుకోస్తూ యూజ‌ర్ల‌ను ఆక‌ట్టుకుంటోంది. ఈ క్ర‌మంలోనే వాట్సాప్ వినియోగం కోట్ల‌లో ఉంది. చాలా సులభంగా దీన్ని వాడే సదుపాయం ఉండటం వల్ల కూడా ఎక్కువ మంది దీన్ని వినియోగించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.

 

అయితే వాట్సాప్‌లో త్వరలో మరిన్ని ఫీచర్స్ కూడా అందుబాటులోకి రానున్నాయి. వాటిలో మూడు ఫీచర్స్ హైలైట్‌గా నిలవనున్నాయి. అవేంటి..? వాటి ఉప‌యోగాలు ఏంటి..? అన్న‌ది ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. అందులో ముందుగా ఆటో డౌన్‌లోడ్ రూల్స్‌.. వాట్సప్‌లో ఫార్వర్డ్ మెసేజెస్ ఎప్ప‌టిక‌ప్పుడు వ‌స్తూనే ఉంటాయి. వీటిలో అవసరం లేని ఫోటోలు, వీడియోలు ఎక్కువగా ఉంటాయి. ఇలా ఎక్కువగా ఫార్వర్డ్ అయ్యే ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్స్, వాయిస్ మెసేజెస్ ఆటో డౌన్‌లోడ్ కాకుండా డిసేబుల్ చేసే ఆప్షన్ త్వరలో వాట్సప్‌లో రానుంద‌ని తెలుస్తోంది.

 

అలాగే బ్యాకప్‌ పాస్‌వర్డ్ ప్రొటెక్ష‌న్‌.. ఈ ఫీచ‌ర్ ద్వారా గూగుల్ డ్రైవ్‌లోని మీ ఛాట్ బ్యాకప్స్‌కి పాస్‌వర్డ్ సెట్ చేసుకోవచ్చు. ఛాట్ బ్యాకప్ సెట్టింగ్స్‌లో ఈ ఫీచర్ కనిపించనుంది. మీరు ఈ ఫీచర్ ఆన్ చేస్తే మీ ఛాట్ బ్యాకప్స్ అన్నీ పాస్‌వర్డ్‌తో ఎన్‌క్రిప్ట్ అవుతాయి. దీని వల్ల మీ ప్రైవసీ కూడా పెరుగుతుంది. ఇక మ‌రో ఫీచ‌ర్ అడ్వాన్స్ సెర్చ్‌.. మీకు వాట్సప్‌లో మెసేజెస్, ఫోటోస్, వీడియోస్, గిఫ్ ఫైల్స్ వస్తుంటాయి. 

 

అయితే ఇటీవల కాలంలో వాట్సప్‌లో ఫేక్ న్యూస్ ఎక్కువగా సర్క్యులేట్ అవుతోంది. ఇది పెద్ద త‌ల‌నొప్పిగా మారింది. ఈ క్ర‌మంలోనే ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోవడం కష్టమైపోతుంది. అందుకే అడ్వాన్స్ సెర్చ్ ఫీచర్‌ని రూపొందిస్తోంది వాట్సప్. మీకు వచ్చిన మెసేజ్‌ను అక్కడే సెర్చ్ చేయడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఈ ఫీచ‌ర్లు అందుబాటులోకి వ‌స్తే మీ వాట్సాప్ అదుర్సే అవుతుంది.
   

మరింత సమాచారం తెలుసుకోండి: