హైదరాబాద్ గచ్చిబౌలిలో బయోటెక్నాలజీ విభాగానికి చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ యానిమల్‌ బయోటెక్నాలజీ (ఎన్‌ఐఏబీ)లో కరోనా వైరస్‌ను గుర్తించే ప్ర‌యోగాల‌పై దృష్టిసారిస్తోంది. వైర‌స్‌ను త్వ‌రిత‌గ‌తిన గుర్తించ‌డం వ‌ల‌న ఎక్కువ‌గా వ్యాప్తి జ‌ర‌గ‌కుండా నియంత్రించేందుకు అవ‌కాశం ఏర్ప‌డుతుంద‌ని ఈ దిశ‌గా ప్ర‌యోగాలు సాగిస్తున్న‌ట్లు ఎన్ ఐ ఏబీ అధికారులు తెలిపారు.  కరోనా వైరస్‌ శరీర క‌ణ‌జాలంతో క‌ల‌వ‌డం మూలంగా వృద్ధి చెందుతున్న‌ట్లుగా వైద్య నిపుణులు, శాస్త్ర‌వేత్త‌లు ఇప్ప‌టికే గుర్తించిన విష‌యం తెలిసిందే. వైర‌స్‌కు స్పై ప్రోటీన్ ద్వారా క‌ణ‌జాలంలోకి చొర‌బ‌డుతున్న‌ట్లుగా విశ్లేష‌ణ‌ల్లో తేలుతోంది. 

 

ఇందుకోసం డయాగ్నస్టిక్‌ కిట్‌, వైరస్‌ ఇంజినీరింగ్‌తో కొవిడ్‌-19 ఔషధాలు పరీక్షించే వినూత్న విధానం అభివృద్ధిపై శోధ‌న‌లు చేస్తున్న‌ట్లు చెప్పారు.  కణానికి వైరస్‌ అతుక్కుని ఉంటే వైరస్‌లోని న్యూక్లిక్‌ యాసిడ్‌ను ఎలక్ట్రో కెమికల్‌ సెన్సర్‌ గుర్తిస్తుంది. ఈ కొత్త పద్ధతిలో రెండు నిమిషాల్లోనే వైరస్‌ సోకిందో లేదో తెలిసిపోతుంది. దీనిపైనే ఎన్‌ఐఏబీ ఇప్పుడు పరిశోధకులు ప‌నిచేస్తున్నారు.  ప‌రిశోధ‌న‌ల నిర్వ‌హ‌ణ కోసం ప్రయోగశాలలో కృత్రిమంగా సరోగేట్‌ కణం ఉపరితలంపై కరోనా వైరస్‌ ప్రొటీన్లను పెంపొందిస్తున్నారు. ఆర్‌ఎన్‌ఏ లేకుండా కేవలం ప్రొటీన్లు పెరిగేలా చేస్తుండ‌టం గ‌మ‌నార్హం.

 

 దీంతో ఔషధ పరీక్షలు చేయడం తేలిక అవుతుంద‌ని భావిస్తున్నారు.  వైరస్‌ను తగ్గించే ఔషధాలు ఇచ్చినప్పుడు వైరస్‌ ప్రొటీన్లు, రిసెప్టర్‌తో అతుక్కోకపోతే ఆ మందులు పనిచేస్తున్నట్లు నిర్ధారణకు రావొచ్చని ప‌రిశోధ‌కుల అంచ‌నా వేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మ‌ర‌ణ మృదంగం కొన‌సాగిస్తోంది.  ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 2 లక్షలు దాటిపోవ‌డం గ‌మ‌నార్హం. ఇక క‌రోనా బారిన ప‌డిన వారి సంఖ్య ఏకంగా 29 లక్షలకు చేరువైంది. అయితే... మొత్తం కేసుల్లో మూడో వంతు, మరణాల్లో నాలుగో వంతు ఒక్క అమెరికాలోనే చోటుచేసుకున్నాయి.  స్పెయిన్‌, ఇటలీ, ఫ్రాన్స్‌, జర్మనీ, బ్రిటన్‌, టర్కీల్లో నమోదైన మొత్తం కేసుల కంటే ఇక్కడి కేసులే ఎక్కువగా ఉన్నాయి. ప‌రిస్థితి ఇంత భ‌యాన‌కంగా ఉన్నా అమెరికా మాత్రం లాక్‌డౌన్ ఎత్తివేత‌కు ఆస‌క్తి చూపుతుండ‌టం విశేషం. 

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: