నేటి త‌రానికి ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు `వాట్సాప్‌`. వినియోగించ‌డానికి ఎంతో సులువుగా ఉంటే వాట్సాప్ యూజ‌ర్స్ కోట్ల‌లో ఉన్నారు అంటే అతిశ‌యోక్తి కాదు. అస‌లు స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేశాక‌.. ముందుగా వాట్సాప్‌నే చాలా మంది డౌన్‌లోడ్ చేసుకుంటార‌ట‌. ఇక వాట్సాప్ కూడా యూజ‌ర్ల‌ను ఆక‌ట్టుకునేందుకు ర‌క‌ర‌కాల ఫీచ‌ర్ల‌ను తీసుకువ‌స్తూ.. కొత్త పుంత‌లు తొక్కుతోంది. ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే.. సాధార‌ణంగా ఏదన్నా ఒక మెసేజ్ మనకు రాగానే వెనకాముందు ఆలోచించకుండా మన లిస్టులో ఉన్నవాళ్లందరికి పంపించేస్తుంటాం. తీరా అది ఫేక్ అని తెలిసాక నోరెళ్లబెడతాం. వాట్సప్ వచ్చాక ఫేక్ మెసేజెస్ ఫార్వర్డింగ్ ఎక్కువయింది.

 

ఇక ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ రోజురోజుకు విజృంభిస్తుండ‌డంతో.. ఈ ఫేక్ న్యూస్‌ల గోల మ‌రీ విప‌రీతంగా పెరిగిపోయింది. వాస్త‌వానికి వాట్సాప్ లో ఎలాంటి మెసేజ్ అయినా షేర్ చేసే అవకాశం ఉన్నది.  నూటికి 70 శాతం ఫేక్ మెసేజ్ లు షేర్ అవుతుంటాయి.  వాటి వలన కొన్నిసార్లు ఇబ్బందులు తలెత్తుతుంటాయి. ఈ క్ర‌మంలోనే ప్ర‌జ‌ల‌కు ఏది న‌మ్మాలో.. ఏది న‌మ్మ‌కూడ‌దో.. అర్థంగాక అయోమ‌యంలో ప‌డుతున్నారు. ఇలాంటి సమయంలో ఫేక్ వార్తలకు చెక్ పెట్టడానికి ప్రసిద్ధ సామాజిక మాద్యమం వాట్సాప్ ముందుకొచ్చింది. ఫేక్ మెసేజ్‌ల‌ను ఈజీగా గుర్తించేందుకు వాట్సాప్‌.. పాయింటర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫ్యాక్ట్ చెకింగ్ నెట్ వర్క్.. IFCN తో అనుసంధానమైంది.

 

దీని వ‌ల్ల వాట్సప్ వినియోగదారులు తమకు వచ్చిన మెసేజ్ నిజ‌మా..? కాదా..? అనే విషయాన్ని ఈజీగా గుర్తించగలరు. పాయింటర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫ్యాక్ట్ చెకింగ్ నెట్ వర్క్.. ముందుగానే ఆ అంశాన్ని ఫ్యాక్ట్ చెక్ చేసి ఉంచినట్లయితే ఇది సాధ్యపడుతుంది. ఇక ఇందుకోసం ఒక న్యూమెరికల్ మెనూను తయారు చేశారు. యూజర్లు నంబర్లు టైప్ చేయడం ద్వారా ఫేక్ మేసేజ్‌లను గుర్తించవచ్చు. అయితే ప్రస్తుతం ఇంగ్లిష్‌లో మాత్రమే సౌలభ్యం ఉంది. కానీ, అతి త్వరలోనే హిందీ, స్పానిష్, పోర్చుగీస్ లాంటి భాషలు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

 
  

మరింత సమాచారం తెలుసుకోండి: