ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్‌.. ప్ర‌పంచ‌దేశాల‌ను ప‌ట్టిపీడిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ మ‌హ‌మ్మారి ధాటికి చిన్నా.. పెద్దా అని తేడా లేకుండా అన్ని దేశాలు అత‌లాకుత‌లం అవుతున్నాయి. మొద‌ట చైనాలో పుట్టుకొచ్చిన ఈ వైర‌స్ అనాతి కాలంలోనే దేశ‌దేశాలు వ్యాప్తిచెందింది. ఇక ఈ ప్రాణాంత‌క‌ర మ‌హ‌మ్మారికి వ్యాక్సిన్ లేక‌పోవ‌డంతో ప్ర‌భుత్వాల‌కు మ‌రింత పెద్ద త‌ల‌నొప్పిగా మారింది. అయిన‌ప్ప‌టికీ క‌రోనాతో ప్రపంచ‌దేశాలు పోరాడుతూనే ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే ప‌లు దేశాలు లాక్‌డౌన్ విధించారు. ప్ర‌జ‌ల‌ను ఇంటి నుంచి బ‌య‌ట‌కు రాకుండా కఠిన ఆంక్ష‌లు విధించారు. 

 

అయితే ఈ లాక్‌డౌన్ కారణంలో ఇంట్లో ఉంటున్న ప్ర‌జ‌ల్లో అధిక శాతం మంది ఫోన్‌కే ప‌రిమితం అవుతున్నారు. ఈ క్ర‌మంలోనే గేమ్స్, వీడియో కాల్స్, డిజిటల్ పేమెంట్స్... ఇలా వేర్వేరు అవసరాలకు యాప్స్ తెగ డౌన్‌లోడ్ చేస్తున్నారు. మ‌రి లాక్‌డౌన్ వేళ అత్య‌ధికంగా డౌన్‌లోడ్ అయిన యాప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇందులో ముందుగా.. ఆరోగ్య సేతు యాప్‌. కరోనా పై ప్రజలను అప్రమత్తం చేసేందుకు ప్రభుత్వం తెచ్చిన 'ఆరోగ్య సేతుస‌ యాప్‌ను ఏప్రిల్‌లో 20,397,715 డౌన్‌లోడ్స్ జ‌రిగాయి. ఈ యాప్ ను కేంద్రం తయారు చేసింది. కరోనా వైరస్ వ్యాప్తికి దూరంగా ఉండేందుకు ఈ యాప్ దోహాదపడుతోంది. 

 

అలాగే టిక్‌టాక్ వీడియో క్రియేటింగ్, షేరింగ్ యాప్ ఏప్రిల్‌లో 10,612,708 డౌన్‌లోడ్స్ జ‌రిగాయి. చిన్న చిన్న వీడియోలను షేర్ చేసుకునే వేదిక అయిన టిక్‌టాక్ యాప్‌ను ఎంద‌రో ఉప‌యోగిస్తున్నారు. అయితే లాక్‌డౌన్ కార‌ణంగా దీని వినియోగం మ‌రింత పెరిగింది. లూడో కింగ్ గేమింగ్ యాప్ ఏప్రిల్‌లో 15,912,230 డౌన్‌లోడ్స్ జ‌రిగాయి. జూమ్ వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ ఏప్రిల్‌లో 15,080,528 డౌన్‌లోడ్స్ జ‌రిగాయి. గూగుల్ పే డిజిటల్ పేమెంట్ సిస్టమ్ యాప్ ఏప్రిల్‌లో 8,546,229 డౌన్‌లోడ్స్ జ‌రిగాయి. వాట్సప్ మెసేజింగ్ యాప్ ఏప్రిల్‌లో 7,220,685 డౌన్‌లోడ్స్ జ‌రిగాయి. ఏదేమైనా లాక్‌డౌన్ వేళ ఈ యాప్స్‌ను ఏ స్థాయిలో ఉప‌యోగిస్తున్నారో ఈ లెక్క‌లు చెబుతున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: