రియల్‌మీ స్మార్ట్ ఫోన్ ప్రియులకు శుభవార్త. వాస్త‌వానికి ఇటీవ‌ల కాలంలో రియ‌ల్‌మీ స్మార్ట్‌ఫోన్లుకు క్రేజ్ బాగా పెరిగిపోయింద‌ని చెప్పాలి. అద్భుత‌మైన ఫీచ‌ర్లు, అతి త‌క్కువ ధ‌ర్ల‌కే ఫోన్లు అందుబాటులో రావ‌డంతో.. ఎక్కువ శాతం మంది రియ‌ల్‌మీ వైపే మొగ్గు చూపిస్తున్నారు. ఇక తాజాగా రియల్‌మీ మరో రెండు కొత్త‌ ఫోన్ల‌ను భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది. రియల్ మీ ఎక్స్3, రియల్ మీ ఎక్స్3 సూపర్ జూమ్ స్మార్ట్ ఫోన్లు ఇండియాలో రిలీజ్ చేసింది. ఈ రెండు ఫోన్లూ 120 హెర్ట్జ్ డిస్ ప్లే, వెనకవైపు నాలుగు కెమెరాలతో లాంచ్ అయ్యాయి. 

 

రియల్ మీ ఎక్స్3 స్పెసిఫికేషన్లు ప‌రిశీలిస్తే.. రియల్ మీ ఎక్స్3 స్మార్ట్ ఫోన్ లో 6.6 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ అల్ట్రా స్మూత్ డిస్ ప్లేను అందించారు. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 855+ ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి. అందులో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగా పిక్సెల్ ఉండ‌గా.. 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాను సైతం అమ‌ర్చారు. 12 మెగా పిక్సెల్ టెలిఫొటో సెన్సార్, 2 మెగా పిక్సెల్ మాక్రో సెన్సార్ లు కూడా ఇందులో ఉన్నాయి. ఇక 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమ‌రాను అందించారు. అలాగే 4,200 ఎంఏహెచ్ భారీ బ్యాట‌రీ, 30W ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ, ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇందులో ఉన్నాయి. చివ‌రిగా ధ‌ర విష‌యానికి వ‌స్తే..  6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,999 ఉండ‌గా.. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.25,999గా ఉంది.

 

రియల్ మీ ఎక్స్3 సూపర్ జూమ్ స్పెసిఫికేషన్లు ప‌రిశీలిస్తే.. ఇందులోనూ 6.6 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ అల్ట్రా స్మూత్ డిస్ ప్లేను అందించారు. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 855+ ప్రాసెసర్ పైనే ఈ ఫోన్ కూడా పనిచేయనుంది. రియల్ మీ ఎక్స్3 సూపర్ జూమ్ వెనకవైపు నాలుగు కెమెరాలు అందించారు. అందులో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగా పిక్సెల్ ఉండ‌గా.. 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాను కూడా అందించారు. 8 మెగా పిక్సెల్ పెరిస్కోప్ తరహా సెన్సార్, 2 మెగా పిక్సెల్ మాక్రో సెన్సార్ లు కూడా ఇందులో ఉన్నాయి.  32 మెగాపిక్సెల్, 8 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న రెండు కెమెరాలను సెల్ఫీల కోసం అమ‌ర్చారు. అలాగే 4,200 ఎంఏహెచ్ భారీ బ్యాట‌రీ, 30W ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ ఇందులో ఉన్నాయి. చివ‌రిగా ధ‌ర విష‌యానికి వ‌స్తే..  8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.27,999 ఉండ‌గా.. 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.32,999గా ఉంది. ఇక ఈ రెండు ఫోన్లూ ఆర్కిటిక్ వైట్, గ్లేసియర్ బ్లూ రంగుల్లో అందుబాటులో ఉన్నాయి.
 

మరింత సమాచారం తెలుసుకోండి: