ఒకప్పుడు బెస్ట్ ఫోన్ అంటే అందరికి ఐఫోన్ ఏ.. కానీ ఇప్పుడు వన్ ప్లస్ వచ్చింది. ఐఫోన్ ఆపిల్ కంటే మించిన అద్భుతమైన స్మార్ట్ ఫోన్ ఇది. సంవత్సరానికి రెండు సిరీస్ లను విడుదల చేస్తున్న వన్ ప్లస్ ఇప్పుడు మరో అద్భుతమైన బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేయనుంది. అవే వన్ ప్లస్ జెడ్ లేదా వన్ ప్లస్ నార్డ్. 

 

ఇంకా ఈ స్మార్ట్ ఫోన్లలో ఓ స్పెషల్ ఉంది. అది ఏంటి అంటే? ఇంతవరకు ఏ స్మార్ట్ ఫోన్ లో లేని ఓ ఫీచర్ ఈ వన్ ప్లస్ బడ్జెట్ ఫోన్స్ లో లయఞ్చ కానుంది. అదే డ్యూయల్ సెల్ఫీ కెమెరాలు. తాజాగా లాంచ్ అయిన వన్ ప్లస్ 8 సిరీస్ ఫోన్ లో కూడా ఒక సెల్ఫీ కెమెరానే అందించారు. దీనికి సంబంధించిన టీజర్ పేజ్ ను కూడా అమెజాన్ వెబ్ సైట్ లో అందించారు. 

 

32 మెగా పిక్సెల్, 8 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న రెండు కెమెరాలను ఈ స్మార్ట్ ఫోన్ లో అందించనున్నట్లు సమాచారం. రియల్ మీ ఎక్స్3 తరహాలో ఈ డిజైన్ ఉండనుంది. ముందువైపు ఒక కెమెరానే ఉండనుంది. అయితే 2013 డిసెంబర్ లో వన్ ప్లస్ మొదటి ఫోన్ నుంచి సింగిల్ సెల్ఫీ కెమెరానే లాంచ్ చేస్తూ వచ్చింది. 

 

వన్ ప్లస్ 8 ప్రో స్మార్ట్ ఫోన్ లో రెండు సెల్ఫీ కెమెరాలు అంటూ వార్తలు వచ్చినప్పటికీ సింగిల్ సెల్పీ కెమెరాతోనే లాంచ్ చేశారు. కానీ ఇప్పుడు ఈ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లో సెల్ఫీకి డ్యూయల్ కెమెరాలు, వెనకవైపు నాలుగు కెమెరాలు ఉండనున్నాయి. 12 జీబీ వరకు ర్యామ్, క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 765జీ ప్రాసెసర్ ను ఇందులో అందించనున్నారు. మరి ఈ స్మార్ట్ ఫోన్లు ఎప్పుడు లాంచ్ అవుతాయి అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: