స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో అదిరిపోయే ఫీచర్లతో ఎన్ని అద్భుతమైన ఫోన్లు అందుబాటులోకి వచ్చినా.. యాపిల్ ఐఫోన్లకు ఉండే క్రేజే వేరు. చేతిలో ఐఫోన్ ఉంటే అదేదో గొప్పగా ఫీల్ అవుతుంటారు కొంతమంది. వాస్తవానికి యాపిల్ ఐఫోన్‌లలో డిజైనింగ్ మొదలుకుని స్పెసిఫికేన్‌ల వరకు ప్రత్యేకమైన ప్రాధాన్యతను సంతరించుకుని ఉంటాయి. ఇదిలా ఉంటే.. ఇటీవల సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ యాపిల్ భారత్‌లో ఐఫోన్ల ధరలను పెంచేసిన సంగతి తెలిసిందే. కేంద్ర బడ్జెట్‌లో దిగుమతి సుంకంలో మార్పులు చేయడంతో ఈ నిర్ణయం తీసుకుంది.
అయితే ఇప్పుడు ఐఫోన్లు కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే.. అమెజాన్ యాపిల్ డేస్ సేల్ పేరిట ఐఫోన్లపై భారీ తగ్గింపును అందిస్తుంది. మరి ఏ ఏ ఐఫోన్లు ఎంత ధర తగ్గాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఐఫోన్ 8 ప్లస్ 64 జీబీ వేరియంట్ పై ఈ సేల్ లో ధర తగ్గింపును అందించారు. ఈ ఫోన్ ను ప్రస్తుతం రూ.41,500కే కొనుగోలు చేయవచ్చు. యాపిల్ తాజా స్మార్ట్ ఫోన్ అయిన ఐఫోన్ 11 64 జీబీ వేరియంట్‌పై సైతం అమెజాన్ భారీ తగ్గింపును అందించింది. ఈ ఐఫోన్ ధర రూ.68,300గా ఉండగా.. అమెజాన్ యాపిల్ డేస్ సేల్ రూ.62,900కే కొనుగోలు చేయవచ్చు.
ఐఫోన్ 11 ప్రో, ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్ స్మార్ట్ ఫోన్లపై అమెజాన్ ఇప్పటివరకు ఎటువంటి డిస్కౌండ్ ను ప్రకటించలేదు. సేల్ ప్రారంభమయ్యాక వీటిపై కూడా ధర తగ్గే అవకాశం కనిపిస్తోంది. ఇక మరో విషయం ఏంటంటే.. కేవలం ఐఫోన్ల మీదనే కాకుండా యాపిల్ ఇతర ఉత్పత్తులైన ఐప్యాడ్ సిరీస్, వాచ్ సిరీస్ మీద కూడా అమెజాన్ యాపిల్ డేస్ సేల్‌లో భారీ తగ్గింపును అందిస్తుంది. ఐప్యాడ్ సిరీస్ పై రూ.5,000 వరకు తగ్గింపు లభించనుంది. అలాగే యాపిల్ వాచ్ సిరీస్ 3 కొనుగోలు చేసేవారికి కూడా రూ.1,000 డిస్కౌంట్ లభించనుంది. కాగా, ఈ సేల్ ఇప్పటికే ప్రారంభమైంది. జులై 25వ తేదీతో ఈ అమెజాన్ యాపిల్ డేస్ సేల్ ముగుస్తుంది. కాబట్టి, లేట్ చేయకుండా వెంటనే కొనుగోలు ప్రారంభించండి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి