ఫీచర్లు అదిరిపోయేలా ఉన్నా ఈ ఫోన్ ధర విషయానికొస్తే..మనదేశంలో రూ.6,999గా ఉంది. అయితే ఇందులో కేవలం 2 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. మిడ్ నైట్ బ్లాక్, ఓషన్ వేవ్, క్వెట్జల్ సియాన్, వయొలెట్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.ఈ ఫోన్ ప్రత్యేకతల విషయానికొస్తే..6.82 అంగుళాల హెచ్‌డీ+ ఇన్‌సెల్ ఐపీఎస్ డిస్ ప్లేను అందించారు. డిస్ ప్లే యాస్పెక్ట్ రేషియో 20.5:9గా ఉంది. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో ఏ22 ప్రాసెసర్‌పై ఇన్ ఫీనిక్స్ స్మార్ట్ 4 పనిచేయనుంది. 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. దీన్ని మైక్రో ఎస్‌డీకార్డు ద్వారా ఇంకా పెంచుకునే అవకాశం ఉందని కంపెనీ వెల్లడించింది..
ఇకపోతే ఈ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం విషయానికొస్తే.. 6000 ఎంఏహెచ్‌గా ఉంది. 10W ఫాస్ట్ చార్జింగ్‌ను కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్‌లో వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగాపిక్సెల్‌గా ఉండగా, మరో డెప్త్ సెన్సార్‌ను కూడా ఇందులో అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగా పిక్సెల్ కెమెరాను అందించారు. ఆండ్రాయిడ్ 10 ప్రాసెసర్ ఇందులో ఉంది. మరి వెనుక వైపు కెమెరాలతో పాటుగా పింగర్ ప్రింట్ సెన్సార్ ను కూడా అందించారు..ఎటూ చూసిన ఈ ఫోన్ ధర తక్కువ అయిన ఎక్కువ ఫీచర్లు కలిగి ఉండటంతో ఈ ఫోన్ కు డిమాండ్ భారీగా పెరిగింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి