మ్యాజిక్ బ్లూ, మెటాలిక్ వైట్, మ్యాజిక్ బ్లాక్ కలర్స్ కలో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.. అయితే ఈ ఫోన్ మార్కెట్ లోకి వచ్చి మూడు నెలలు కాకుండానే ఆఫర్ ను అందించడం పై ప్రజలు ఆలోచనలు చేస్తున్నారు. మీడియాటెక్ హీలియో పీ95 ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది.ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పీ95 ప్రాసెసర్ పై ఒప్పో ఎఫ్17 ప్రో పనిచేయనుంది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. ఇక మెమొరి కార్డు ద్వారా స్టోరేజ్ ను పెంచుకోవచ్చు అని కంపెనీ వెల్లడించింది..
ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఫోన్ లో వెనకవైపు నాలుగు కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగా పిక్సెల్ కాగా, 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగా పిక్సెల్ మోనోక్రోమ్ లెన్స్, 2 మెగా పిక్సెల్ పొర్ ట్రెయిట్ లెన్స్ కూడా ఇందులో అందించారు.ఇక సెల్ఫీలు తీసుకునేందుకు వీలుగా 16 మెగా పిక్సెల్, 2 మెగా పిక్సెల్ ఉన్న రెండు కెమెరాల ముందు వైపు అందించారు. ఆండ్రాయిడ్ 10 ఆధారిత కలర్ఓఎస్ 7.2 ఆపరేటింగ్ సిస్టంపై ఒప్పో ఎఫ్17 ప్రో పనిచేయనుంది. బ్యాటరీ సామర్థ్యం విషయానికొస్తే..4000 ఎంఏహెచ్ గా ఉంది. 164 గ్రాముల బరువును కలిగి ఉంటుంది. ప్రస్తుతం రేట్లు తగ్గడంతో ఈ ఫోన్ ను కొనుగోలు చేసే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి