న్యూఢిల్లీ: ఎస్బీఐ అకౌంట్ ఉన్న వారందరికి గుడ్‌న్యూస్ చెప్పింది ఎస్బీఐ సంస్థ. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజంగా ఎస్బీఐ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అంతే కాకుండా అత్యంత ఎక్కువ కస్టమర్లను, బ్యాంకు చైన్లను కూడా ఎస్బీఐ కలిగి ఉంది. ఈ విషయాన్ని పక్కన పెట్టి అసలు మ్యాటర్ లోకి వెళ్లిపోతే.. ఆదాయ పన్ను(ఐటీ) చెల్లించేవారు ఐటీ రిటర్న్‌ చేయాల్సి ఉంటుంది. అలాంటి వారికి ఐటీ రిటర్న్‌ను ఉచితంగా దాఖలు చేసుకునే సౌకర్యాన్ని ఎస్బీఐ కలిగించింది. ఈ విషయాన్ని ఎస్బీఐ సంస్థ తమ సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించింది. అయితే ఉచితంగా దాఖలు చేసుకోవాలంటే కచ్చితంగా యోనో యాప్ ద్వారానే చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ యాప్ ద్వారా ఐటీ రిటర్న్‌ను ఎలా చేసుకోవాలో చూద్దాం.

ముందుగా యోనో యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని లాగిన్ అవ్వాలి. లాగిన్ అయ్యేందుకు వివిధ మార్గాలు ఉంటాయి. ఇంటర్నెట్ బ్యాంకింగ్, లేదా అకౌంట్ నెంబర్ ద్వారా లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయిన తరువాత షాప్ అండ్ ఆర్డర్ కేటగిరికి వెళ్లాలి. అందులోకి వెళ్లాక ట్యాక్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ ద్వారా ఆదాయ పన్ను రిటర్న్ చేసుకునే అవకాశం ఉంటుంది. టాక్స్2విన్ అని ఏదైనా కనిపిస్తే మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు దాన్ని క్లిక్ చేయవచ్చు. ఈ ప్రాసెస్‌లో ఏవైనా సందేహాలు వస్తే 9660996655 నెంబరుకు ఫోన్ చేసి సందేహాలను తీర్చుకోవచ్చని ఎస్బీఐ సూచించింది. ఫోన్ నెంబర్ ద్వారా కాకుండా ఈ మెయిల్ ద్వారా కూడా సంస్థను సంప్రదించవచ్చు. support@tax2win.inకు ఈ మెయిల్ పంపితే సంస్థ నుంచి రిప్లై వస్తుంది.

కాగా.. గత ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్ దాఖలు చేసుకునే గడువును డిసెంబర్ 31 నుంచి జనవరి 10 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. దీంతో ఎస్బీఐ ఖాతా ఉన్న వారికి ఈ ఆఫర్ బాగా పనిచేయనుంది. ఇక మరోపక్క చార్టెడ్ అకౌంటెంట్ సహాయాన్ని కూడా తీసుకోవచ్చంటూ ఎస్బీఐ తెలిపింది. ఈ సహాయం కావాలనుకున్న వారు కనీస చార్జీ కింద రూ. 199 చెల్లించాల్సి ఉంటుందని కూడా స్పష్టం చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: