ప్రస్తుతం విదేశాల నుంచి దేశీయ మార్కెట్లోకి ఎలక్ట్రిక్ కార్లు వచ్చి సందడి చేస్తుంటే, ఇంకా మారుతీ సుజుకీ మాత్రం ఎలాంటి వార్తను తమ నుంచి వెల్లడించలేదు. టెస్లా లాంటి వాహన తయారీ దిగ్గజ కంపెనీలు భారతీయ దేశీయ మార్కెట్లోకి ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఇక ఇండియన్ మార్కెట్లోకి మారుతీ సుజుకీ మాత్రం ఇంకా తన ఎలక్ట్రిక్ కార్ ను తీసుకు రాలేదు. అయితే ఒక వ్యక్తి మారుతీ సుజుకీ కారు ని ఎలక్ట్రిక్ వెహికల్ గా మార్చాలని ప్రయోగం చేశాడు. ఇక ఈ డిజైర్ వాహనం 2020 ఫిబ్రవరి మోడల్ పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనంగా మారిపోయింది.
చాలా రెగ్యులర్ స్టాండర్డ్ వెహికల్స్ ను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చిన నార్త్ వే మోటార్ స్పోర్ట్స్ సంస్థ సాధారణ మారుతీ సుజకీ కారుని ఎలక్ట్రిక్ మారుతీ సుజికీ గా మార్చింది. టెస్టింగ్ దశలోనే ఉన్న ఈ మోడల్ ఇంకా సర్టిఫికెట్ మాత్రమే పొందాల్సి ఉంది. ఇక ఈ వాహనాన్ని పూర్తీ స్థాయి ఎలక్ట్రిక్ వాహనంగా మార్చేందుకు అంతా ఇంట్లోనే పనిచేశారట. ఇప్పుడు దానిలో 15 కిలోవాట్స్ మోటర్ వాడుతుండగా, అవసరమైతే 35 కిలోవాట్స్ వరకూ పెంచుకోవచ్చు.
ఇక ఈ ఎలక్ట్రిక్ మోటార్ సహాయంతో 170 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి అవుతుండగా, ఇక చక్రాల వద్దకు వచ్చేసరికి 842 ఎన్ ఎమ్ గా ఉంటోంది. ఇక ఇందులో 13 కిలోవాట్ పర్ హావర్ సామర్థ్యం ఉన్న బ్యాటరీ ఉండగా దానిని 15 కిలోవాట్ పర్ హావర్ వరకు అప్ గ్రేడ్ చేసుకోవచ్చు. అదనంగా మిగిలి ఉన్న స్పేస్ లో మరో బ్యాటరీ ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దానిని 18 కిలోవాట్ పర్ హావర్ కెపాసిటీ వరకూ పెంచుకోవచ్చు.
మారుతీ సుజకీ కారు 947 కేజీ బరువు ఉన్న స్టాక్ డిజైర్ ఎలక్ట్రిక్ కారుగా మారిన తరువాత మరో 3 కేజీల బరువు పెరిగి మొత్తం 950 కేజీల బరువు ఉంది.ఇందులో వుండే క్లస్టర్, పవర్ స్టీరింగ్, ఏ బీ ఎస్, ఎయిర్ బ్యాగ్, ఈ బీ డీ ఇలా అన్ని ఫీచర్లు పనిచేసేలా స్మార్ట్ వర్షన్ లాగా తయారవుతోంది. ఈ ఎలక్ట్రిక్ కార్ స్పీడ్ విషయానికి వస్తే గంటకు 160 కిలోమీటర్లు ఉండగా, 34% వాలుగా ఉండే ఎత్తుకు కూడా ఎక్కకలదు. ఇక 3 టన్నుల బరువు వేసినప్పటికీ కదలగల శక్తి ఈ కారుకు ఉంది. ఇక ఈ కారుకి పూర్తి స్థాయిలో ఛార్జింగ్ అవ్వాలంటే మొత్తం 8 గంటల సమయం పడుతుంది. ఇక అంతకన్నా తక్కువ సమయంలోనే ఫుల్ చార్జింగ్ అయ్యే పద్ధతి కోసం నార్త్ వే మోటార్ స్పోర్ట్స్ సంస్థ వారు ప్రయత్నాలు చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి